ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు.. అదే మీ కొంప ముంచుతుంది

IPL 2021:  Pragyan Ojha Warns Mumbai Indians Dont To Be Over Confidence - Sakshi

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌ ముంగిట డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి ఆ జట్టు మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా చిన్న వార్నింగ్ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా ఆర్‌సీబీతో ముంబై ఆడనున్న నేపథ్యంలో ప్రగ్యాన్ ఓజా స్పందించాడు. ఈ మ్యాచ్‌కు ముంబైకి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దని.. అదే మీ కొంప ముంచుతుందని తెలిపాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగియగా.. ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020 రూపంలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్స్ అన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబయి ఇండియన్స్ టీమ్ గెలవడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్‌ని ముంబయి ఇండియన్స్ గెలిస్తే..? టోర్నీ చరిత్రలో వరుసగా మూడు సార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా నిలవనుంది. ఇప్పటికే టోర్నీలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబయి టీమ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

‘‘ముంబై ఇండియన్స్ జట్టు మంచి సమతూకంతో కనిపిస్తోంది. గత రెండేళ్లుగా ఆ టీమ్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. ఈ ఏడాది మినీ వేలంలో కూడా ఆ జట్టు ఓ రెండు మూడు స్థానాల్ని భర్తీ చేసుకునేందుకే ప్రాధాన్యమిచ్చింది. ఎందుకంటే.. ఆ జట్టు ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. వరుసగా 2019, 2020లో టైటిల్ గెలవడం ద్వారా ముంబయి టీమ్ ఇప్పుడు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కానీ.. ఓవర్ కాన్ఫిడెంట్‌తో మాత్రం టోర్నీలో ఆడకూడదు’’ అని ప్రగ్యాన్ ఓజా హెచ్చరించాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top