రైనా, కోహ్లిని దాటాడు.. గేల్‌ను దాటలేకపోయాడు

IPL 2021 KL Rahul Smashes Kohli Record Fastest Indian 5000 T20 Runs - Sakshi

చెన్నై: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ ద్వారా ఒక అరుదైన రికార్డు సాధించాడు. మ్యాచ్‌లో రాహుల్‌ 1 పరుగు వద్ద ఉన్నప్పుడు టీ20ల్లో 5వేల పరుగులు వేగంగా పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.అంతేగాక టీమిండియా నుంచి వేగంగా 5వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగాను రాహుల్‌ రికార్డులకెక్కాడు. అంతకముందు టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లి(167 ఇన్నింగ్స్‌ల్లో), సురేశ్‌ రైనా( 173 ఇన్నింగ్స్‌ల్లో) 5వేల పరుగులు మార్క్‌ను అందుకున్నారు.

ఇప్పుడు వారి రికార్డును తుడిచిపెట్టిన రాహుల్‌ 143 ఇన్నింగ్స్‌లో 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 5వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో క్రిస్‌ గేల్‌( 132 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. తాజాగా రాహుల్‌ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఆసీస్‌ నుంచి షాన్‌ మార్ష్‌ టీ20ల్లో 5వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 144 ఇన్నింగ్స్‌లు తీసుకొని మూడవ స్థానంలో నిలిచాడు.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఫేలవ ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 120 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 22, షారుఖ్‌ ఖాన్‌ 22 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆడిన పంజాబ్‌ సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2, రషీద్‌ ఖాన్‌, భువీ, కౌల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 
చదవండి: వార్నర్‌ నువ్వు సూపర్‌.. క్యా రనౌట్‌ హై

'రోహిత్‌ నా ఫెవరెట్‌ ప్లేయర్‌.. అందుకే ఆ పని చేశా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top