ఐపీఎల్‌ 2021: ధోని సేనకు దడ పుట్టించిన కమిన్స్‌‌.. సీఎస్‌కే హ్యాట్రిక్‌ విక్టరీ‌

IPL 2021: CSK Vs KKR Match Live Updates - Sakshi

ధోని సేనకు దడ పుట్టించిన కమిన్స్‌‌.. సీఎస్‌కే హ్యాట్రిక్‌ విక్టరీ
ఊహాకు కూడా అందని గెలుపుపై ఆశలు చిగురింపజేసిన కమిన్స్‌(34 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) .. చివరిదాకా పోరాడి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి బంతికి రెండు పరుగులు తీసే ప్రయత్నంలో నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న ప్రసిద్ధ్‌ కృష్ణ రనౌట్‌ కావడంతో కేకేఆర్‌ అరివీర భయంకరమైన పోరాటం 202 పరుగుల వద్ద ముగిసింది. కమిన్స్‌ చేసిన పెను విధ్వంసం కేకేఆర్‌ అభిమానులకు చిరకాలం గర్తుండిపోతుంది. కేకేఆర్‌ 19.1 ఓవర్‌లో 202 పరుగులకు ఆలౌట్‌ కావడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ధోని సేనకు ఇది హ్యాట్రిక్‌ విజయం కావడం విశేషం.   

కేకేఆర్‌ కొంపముంచిన వరుణ్‌ చక్రవర్తి..కేకేఆర్ తొమ్మిదో వికెట్ డౌన్‌
కమిన్స్‌ పడిన కష్టాన్ని వరుణ్‌ చక్రవర్తి గంగపాలు చేశాడు. 18.3 బంతికి కమిన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ దిశగా డ్రైవ్‌ చేసి రెండు పరుగులకు పిలువగా, వరుణ్‌ చక్రవర్తి తడబడడంతో కేకేఆర్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోవాల్సి వచ్చింది. 18.3 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 200/9. కేకేఆర్‌ గెలుపుకు 9 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది. కేకేఆర్‌ ఆశలన్ని కమిన్స్‌పైనే ఉన్నాయి. క్రీజ్‌లోకి ప్రసిద్ధ్‌ కృష్ణ వచ్చాడు.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌.. నాగర్‌కోటి డకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌
ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన నాగర్‌కోటి(2 బంతుల్లో 0) డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి వరుణ్‌ చక్రవర్తి వచ్చాడు. కేకేఆర్‌ గెలుపునకు 22 బంతుల్లో 45 పరుగులు చేయాల్సి ఉంది.

కర్రన్‌ ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్న కమిన్స్‌

Pat_Cummins
Photo Courtesy: IPL

‌‌‌‌‌‌సామ్‌ కర్రన్‌ వేసిన 16వ ఓవర్‌లో కమిన్స్‌ విశ్వరూపం చూపించాడు. 4 సిక్సర్లు, ఫోర్‌ సాయంతో ఏకంగా 30 పరుగులు పిండుకుని కేకేఆర్‌ గెలుపుపై ఆశలు చిగురింపజేశాడు. దీంతో 16 ఓవర్ల తర్వాత సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. కేకేఆర్‌ గెలుపునకు 24 బంతుల్లో 45 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. క్రీజ్‌లో కమిన్స్‌కు(19 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడుగా  నాగర్‌కోటి(0) ఉన్నాడు. 

కేకేఆర్‌ ఆశలు గల్లంతు..డీకే(40) ఔట్‌‌‌‌‌‌‌‌‌
కేకేఆర్‌ గెలుపుపై చివరి ఆశగా ఉన్న దినేశ్‌ కార్తిక్‌(24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్యూ కావడంతో అతను వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 146/7. క్రీజ్‌లో కమిన్స్‌(18), నాగర్‌కోటి(0) ఉన్నారు. 

రసెల్‌(54) క్లీన్‌ బౌల్డ్..ఆరో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌‌‌‌‌‌‌‌
కేకేఆర్‌ గెలుపుపై దాదాపు ఆశలు వదులుకున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి సిక్సర్ల సునామీ సృష్టించిన డేంజర్‌ మ్యాన్‌ అండ్రీ రసెల్‌(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు)... సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రసెల్‌ ఔటయ్యే సమయానికి(11.2 ఓవర్ల తర్వాత) కేకేఆర్‌ స్కోర్‌ 112/6. క్రీజ్‌లో దినేశ్‌ కార్తిక్‌(24), కమిన్స్‌(0) ఉన్నారు. 

31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కేకేఆర్
ఈ‌ మ్యాచ్‌లో ధోని మూడో క్యాచ్‌ అందుకోవడంతో త్రిపాఠి(9 బంతుల్లో 8; ఫోర్‌) పెవిలియన్‌ చేరుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో ధోని ముచ్చటగా మూడో క్యాచ్‌ అందు​కోవడంతో కేకేఆర్‌ 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను దాదాపు చేజార్చుకుంది. క్రీజ్‌లో రసెల్‌, కార్తిక్‌ ఉన్నారు.

మళ్లీ నాలుగేసిన చాహర్‌
చాహర్‌ వేసిన 5వ ఓవర్‌ ఆఖరి బంతికి నరైన్‌(3 బంతుల్లో 4; ఫోర్‌) కూడా పెవిలియన్‌ బాట పట్టడంతో చాహర్‌ సీజన్‌లో రెండో సారి నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. చాహర్‌ బౌలింగ్‌లో జడేజా అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో నరైన్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 31/4. క్రీజ్లో త్రిపాఠి(8), రసెల్‌(0) ఉన్నారు.

‌‌‌‌‌‌మూడేసిన చాహర్‌.. మోర్గాన్‌(7) ఔట్‌‌‌‌‌
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో దీపక్‌ చాహర్‌ వికెట్ల దాహం కొనసాగుతుంది. తాను వేసిన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన అతను.. మూడో ఓవర్‌లో సైతం మరో వికెట్‌ పడగొట్టి.. కేకేఆర్‌ పరాజయానికి బాటలు వేశాడు. కీలకమైన మోర్గాన్‌(7 బంతుల్లో 7; ఫోర్‌) వికెట్‌ను తీసి కేకేఆర్‌ను చావుదెబ్బ కొట్టాడు. 4.3 బంతికి ధోని క్యాచ్‌ అందుకోవడంతో మోర్గాన్‌ పెవిలియన్‌కు చేరాడు. 4.3 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 27/3. క్రీజ్‌లో త్రిపాఠి(8), నరైన్‌(0) ఉన్నారు.  

రెండో వికెట్‌ తీసిన చాహర్‌.. నితీశ్‌ రాణా(9) ఔట్
పేసర్‌ దీపక్‌ చాహర్‌ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తొలి ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ 5వ బంతికి కేకేఆర్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ నితీశ్‌ రాణాను(12 బంతుల్లో 9; 2 ఫోర్లు) కూడా ఔట్‌ చేసి కేకేఆర్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ధోని అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్ అందుకోడంతో రాణా పెవిలియన్‌ బాట పట్టాడు.‌ చాహర్‌ ధాటికి 3 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 17/2. క్రీజ్‌లో త్రిపాఠి(6), మోర్గాన్‌(0) ఉన్నారు.

కేకేఆర్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌..శుభ్‌మన్‌ డకౌట్‌‌‌
221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాహర్‌ బౌలింగ్‌లో ఎంగిడి క్యాచ్‌ పట్టడంతో గిల్‌ పెవిలియన్‌ బాటపట్టక తప్పలేదు. నాలుగు బంతుల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 1/1. క్రీజ్‌లో నితీశ్‌ రాణా(1), త్రిపాఠి(0) ఉన్నారు.

చెన్నై భారీ స్కోర్‌.. కేకేఆర్‌ టార్గెట్‌ 221
పాట్‌ కమిన్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడు సిక్సర్లు సహా మొత్తం 19 పరుగులు పిండుకున్న చెన్నై బ్యాట్స్‌మెన్లు.. 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన డుప్లెసిస్‌ 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాను ఎదుర్కొన్న ఎకైక బంతిని సిక్సర్‌గా మలచిన జడేజా 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌ మినహా మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌, రసెల్‌లకు తలో వికెట్‌ లభించింది. 

ధోని(17) అవుట్‌.. 19వ ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 201/3
రసెల్‌ వేసిన 19వ ఓవర్‌లో డుప్లెసిస్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టాక,  అదే ఓవర్‌ ఆఖరి బంతికి ధోని(8 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్‌) అవుటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ధోని.. ఎక్స్‌ట్రా కవర్‌ ఫీల్డర్‌ మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 19 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 201/3. క్రీజ్‌లోకి జడేజా వచ్చాడు.

చెన్నై రెండో వికెట్‌ డౌన్‌.. మొయిన్‌ అలీ(25) స్టంప్‌ అవుట్
ధాటిగా ఆడుతున్న వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ మొయిన్‌ అలీని(12 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సునీల్‌ నరైన్‌ బోల్తా కొట్టించాడు. నరైన వేసిన 16.3 బంతిని తప్పుగా అర్ధం చేసుకున్న మొయిన్..‌ ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంప్‌ అవుటయ్యాడు. 16.3 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 166/2. క్రీజ్‌లో డుప్లెసిస్‌కు(48 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తోడుగా ధోని(0) వచ్చాడు.   

బౌండరీతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన  డుప్లెసిస్
చెన్నై మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌(35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధశతకం సాధించాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి సీజన్‌ తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 12.4 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 120/1. 

ఎట్టకేలకు తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై.. రుతురాజ్‌(64) ఔట్‌ 
హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రుతురాజ్‌(42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రత్నించి కమిన్స్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. 12.2 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 115/1. క్రీజ్‌లోకి మొయిన్‌ అలీ వచ్చాడు.

రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ
చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎట్టకేలకు ఫామ్‌ను అందుకున్నాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్ధసెంచరీ సాధించాడు. రుతురాజ్‌ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ సీజన్‌ తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అతనికి డుప్లెసిస్‌(30 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌) సహకారం కూడా అందడంతో చెన్నై 10.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. 

5.3 ఓవర్లలోనే 50 పరగులు పూర్తి చేసిన సీఎస్‌కే
ఓపెనర్లు డుప్లెసిస్‌(17 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌(17 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్‌) చెలరేగి ఆడటంతో చెన్నై జట్టుకు శుభారంభం లభించింది. కేవలం 5.3 ఓవర్లలోనే ఆ జట్టు 50 పరగులు పూర్తి చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడుతున్నాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో అత్యధికంగా 15 పరగులు వచ్చాయి.    

ముంబై: ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా నేడు చెన్నై, కేకేఆర్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. చెన్నై.. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, ఆవెంటనే కోలుకొని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేయగా, కేకేఆర్‌ పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. కోల్‌కతా..తమ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయ ఢంకా మోగించి, ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది. ఇరు జట్లు ముఖాముఖి పోరులో మొత్తం 24 సార్లు తలపడగా, చెన్నై 15 సందర్భాల్లో విజయం సాధించి కేకేఆర్‌పై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. మరోవైపు కేకేఆర్‌ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి ముఖాముఖి పోరులో వెనకపడి ఉంది. 

ఇరు జట్ల మధ్య గత 5 సందర్భాల్లో జరిగిన పోటీల్లో సైతం ధోని సేననే పూర్తి ఆధిక్యత కనబర్చింది. ఐదింటిలో నాలుగు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసి కేకేఆర్‌పై పైచేయి సాధించింది. అయితే, ఒక్క మ్యాచ్‌ మినహా కేకేఆర్‌.. చెన్నై చేతిలో ఓడిన అన్ని సందర్భాల్లో వేదిక చెన్నైయే కావడంతో నేటి మ్యాచ్‌పై కేకేఆర్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేటి మ్యాచ్‌కు ముంబై ఆతిధ్యం ఇస్తుండటం ఇందుకు కారణం. ఇక దుబాయ్‌ వేదికగా జరిగిన గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే మొదటిసారి.

ఇక జట్ల బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి చెన్నై అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్‌ విభాగంలో ధోని, రుతురాజ్‌ గైక్వాడ్‌ల ఫామ్‌ కాస్త కలవరపెడుతుంది. వీరి మినహా డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, రైనా, రాయుడు, బ్రేవో, సామ్‌ కర్రన్‌, జడేజాలు బ్యాటింగ్‌ పరంగా పర్వాలేదనిపించారు. శార్ధూల్‌, దీపక్‌ చాహర్‌లకు కూడా బ్యాట్‌తో సత్తా చాటిన నేపథ్యం ఉండటంతో చెన్నై బ్యాటింగ్‌ పరంగా పూర్తిగా స్ట్రాంగ్‌ అనే చెప్పాలి. ఇక బౌలింగ్‌లో సైతం సీఎస్‌కే పరిస్థితి ఏమంత తీసికట్టుగా లేదు. గత మ్యాచ్‌లో 3 వికెట్లతో మొయిన్‌ సత్తా చాటగా, అంతకుముందు పంజాబ్‌తో మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ నాలుగేశాడు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు చెన్నై ఫీల్డింగ్‌లో సైతం అదరగొడుతుంది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా పంజాబ్‌తో మ్యాచ్‌లో 3 డిస్‌మిసల్స్‌, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు అందుకొని మైదానంలో పాదరసంలా కదులుతున్నాడు. అయితే, కేకేఆర్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నితీశ్‌ రాణా అర్ధసెంచరీలతో రాణించడం, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో త్రిపాఠి హాఫ్‌ సెంచరీ, ముంబైతో మ్యాచ్‌లో రసెల్‌(5/15) మ్యాజిక్‌ స్పెల్‌ మినహా కేకేఆర్‌ పెద్దగా సాధించిందేది లేదనే చెప్పాలి.

జట్ల వివరాలు:

సీఎస్‌కే: డుప్లెసిస్‌, రుతురాజ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్‌ ధోని, రవీంద్ర జడేజా, ఎంగిడి, సామ్‌ కర్రన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, చాహర్‌

కేకేఆర్‌: నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, మోర్గన్‌, సునీల్‌ నరైన్‌, దినేశ్‌ కార్తిక్‌, అండ్రీ రసెల్‌, పాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తి, కమలేశ్‌ నాగర్‌కోటి, ప్రసిద్ధ కృష్ణ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 14:09 IST
ముంబై: బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ కూడా కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్‌ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి...
06-05-2021
May 06, 2021, 11:04 IST
భారత్‌లో కోవిడ్‌ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్‌ 2021కు కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా...
06-05-2021
May 06, 2021, 06:01 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను...
06-05-2021
May 06, 2021, 04:06 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి తమ...
05-05-2021
May 05, 2021, 19:30 IST
సిడ్నీ: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ స్లేటర్‌ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డాడు. కరోనా విజృంభణతో భారత్‌...
05-05-2021
May 05, 2021, 17:39 IST
ఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ 2021 రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌...
05-05-2021
May 05, 2021, 16:52 IST
చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు...
05-05-2021
May 05, 2021, 16:18 IST
లండన్‌: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం...
05-05-2021
May 05, 2021, 08:00 IST
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని వేదికగా చేసుకొని విజయవంతంగా టోర్నీని ముగించింది.
05-05-2021
May 05, 2021, 07:46 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా...
05-05-2021
May 05, 2021, 00:30 IST
ముంబై: ఐపీఎల్‌ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్‌ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు...
04-05-2021
May 04, 2021, 22:08 IST
ముంబై: భారత్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్‌పై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌...
04-05-2021
May 04, 2021, 21:33 IST
ఐపీఎల్‌ వాయిదా తర్వాత ట్వీట్‌ చేసిన సఫారీ పేసర్‌
04-05-2021
May 04, 2021, 21:15 IST
న్యూఢిల్లీ: బీసీసీఐ ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా పుణ్యానా రద్దు చేయాల్సి వచ్చింది. సోమవారం కేకేఆర్‌ ఆటగాళ్లు...
04-05-2021
May 04, 2021, 19:32 IST
ఢిల్లీ: సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. 7 మ్యాచ్‌లాడి 131 పరుగులు...
04-05-2021
May 04, 2021, 18:53 IST
ఢిల్లీ:  టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌...
04-05-2021
May 04, 2021, 18:14 IST
లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో...
04-05-2021
May 04, 2021, 18:06 IST
మీరు రాకండి.. భారత్‌లోనే ఉండండి: సీఏ
04-05-2021
May 04, 2021, 17:06 IST
మరో 10 రోజుల్లో ఐపీఎల్‌ రీషెడ్యూల్‌?
04-05-2021
May 04, 2021, 16:24 IST
లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించగానే.. ''నా గుండె పగిలిందంటూ'' ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top