KKR Vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై కేకేఆర్‌ విజయం..ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపు ఖరారు

IPL 2021 2nd Phase KKR Vs SRH Match Live Updates And Highlights - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌పై కేకేఆర్‌ విజయం.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపు ఖరారు
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 57 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నితీష్‌ రాణా 25 పరుగులతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో హూల్డర్‌ 2, రషీద్‌ ఖాన్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక చివరి మ్యాచ్‌ను కేకేఆర్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

అంతకముందు ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అబ్దుల్‌ సమద్‌ 25, ప్రియమ్‌ గార్గ్‌ 21 పరుగులు చేశారు. కేకేఆర్‌ బౌలర్ల దాటికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మెన్‌  కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్‌ బౌలర్లలో సౌథీ, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్‌ ఒక వికెట్‌ తీశాడు

విజయానికి 24 పరుగుల దూరంలో కేకేఆర్‌
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. గిల్‌ 57, నితీష్‌ రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి.

9 ఓవర్లలో కేకేఆర్‌ స్కోరు 42/2
116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. గిల్‌ 24, నితీష్‌ రాణా 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు వెంకటేశ్‌ అయ్యర్‌ (8), రాహుల్‌ త్రిపాఠి(7) తక్కువ స్కోర్లకే ఔటై పెవిలియన్‌ చేరారు.

కేకేఆర్‌ టార్గెట్‌ 116
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అబ్దుల్‌ సమద్‌ 25, ప్రియమ్‌ గార్గ్‌ 21 పరుగులు చేశారు. కేకేఆర్‌ బౌలర్ల దాటికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మెన్‌  కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్‌ బౌలర్లలో సౌథీ, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్‌ ఒక వికెట్‌ తీశాడు.

హోల్డర్‌(2) ఔట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 80/6
కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. వరుణ్‌ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన హోల్డర్‌(9 బంతుల్లో 2) వెంకటేశ్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 80 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్లో అబ్ధుల్‌ సమద్‌(12), రషీద్‌ ఖాన్‌ ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ప్రియం గార్గ్‌(21) ఔట్‌
వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ మాయాజాలానికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు ప్రియం గార్గ్‌(31 బంతుల్లో 21; సిక్స్‌) బోల్తా పడ్డాడు. ఇన్నింగ్స్‌ 14.2 ఓవర్లో రాహుల్‌ త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 79/5. క్రీజ్‌లో అబ్ధుల్‌ సమద్‌(12), హోల్డర్‌(1) ఉన్నారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 53/4
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఫేలవ ఆటతీరు కొనసాగిస్తుంది. తాజాగా షకీబ్‌ బౌలింగ్‌లో 6 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గార్గ్‌ 18, అబ్దుల్‌ సమద్‌ 5 పరుగులతో ఆడుతున్నారు. 


Photo Courtesy: IPL

షకీబ్‌ స్టన్నింగ్‌ త్రో.. విలియమ్సన్‌ రనౌట్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ షకీబ్‌ స్టన్నింగ్‌ త్రోకు రనౌట్‌ అయ్యాడు. 26 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన విలియమ్సన్‌ అనవసర పరుగుకు యత్నించి ఔటయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 38 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రియమ్‌ గార్గ్‌ 8, అభిషేక్‌ శర్మ 6 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 35/2
జేసన్‌ రాయ్‌(10) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ నాలుగో బంతికి సౌథీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 24, ప్రియమ్‌ గార్గ్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL

సాహా గోల్డెన్‌ డక్‌..  ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. సౌథీ వేసిన ఓవర్‌ రెండో బంతికే సాహా ఎల్బీగా వెనుదిరిగాడు. సాహా రివ్యూ కోరకుండానే పెవిలియన్‌కు చేరాడు. అయితే రిప్లేలో బంతి వికెట్లపై నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం 1 ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 4/1గా ఉంది.


Photo Courtesy: IPL

దుబాయ్‌: ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్‌ నుంచి ఇంటిబాట పట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఈ మ్యాచ్‌ గెలవడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు.. ప్రత్యర్థి అవకావాలు దెబ్బతీయడం తప్ప. అయితే కేకేఆర్‌కు మాత్రం​ ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. 

ఇక తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 177 పరుగులకే పరిమితమైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 20 సార్లు తలపడగా.. 13సార్లు కేకేఆర్‌.. ఏడుసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచింది.
 

కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top