ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌

IPL 2020: Suresh Raina Returns Home From UAE - Sakshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రకటించింది. సురేశ్‌ రైనా దుబాయి నుంచి వెనక్కి వచ్చేశారు. సురేశ్‌ రైనాకు పూర్తి మద్ధతు ఇస్తామని సీఎస్‌కే ప్రకటించింది. అయితే రైనా వెనక్కి ఎందుకొచ్చాడన్నదానిపై సీఎస్‌కే స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే.  (చదవండి : కరోనా ‘ఆట’ మొదలైంది! )

మరోవైపు ఐపీఎల్‌ 2020లో భాగంగా అందరికంటే ముందు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని భావించిన సీఎస్‌కేకు వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక బౌలర్‌తో పాటు పలువురు స్టాఫ్‌ మెంబర్స్‌కు కరోనా వైరస్‌ సోకింది. సీఎస్‌కే టీంలో దాదాపు 10 మంది కరోనాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  (చదవండి: సురేష్‌ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top