Breadcrumb
Live Updates
శ్రీలంక వర్సెస్ ఇండియా రెండో టెస్ట్ లైవ్ ఆప్డేట్స్
టీమిండియా గెలుపు లాంఛనమే
టీమిండియా నిర్ధేశించిన 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో బంతికే బుమ్రా బౌలింగ్‌లో తిరుమన్నే డకౌట్ కాగా, కెప్టెన్ కరుణరత్నే (10), కుశాల్ మెండిస్ (16) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 419 పరుగులు సాధించాల్సి ఉండగా, టీమిండియా గెలుపుకు 9 వికెట్లు కావాల్సి ఉంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఏదో అద్భుతం జరిగే తప్ప ఈ మ్యాచ్‌లో లంక గట్టెక్కలేదు.
అంతకుముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది.
447 పరుగుల టార్గెట్.. మూడో బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక
447 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్ మూడో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో తిరుమన్నే సున్నా పరుగులకే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
లంక టార్గెట్ 447
ఎంబుల్దెనియా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (9) క్లీన్ బౌల్డ్ అయిన వెంటనే రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు.
శ్రేయస్ ఔట్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
వీలైనన్ని పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్ చేస్ధామనుకున్న తొందరలో టీమిండియా వడివడిగా వికెట్లు కోల్పోతుంది. 278 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ (67) ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 426 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. క్రీజ్‌లో అక్షర్ పటేల్, షమీ ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 278 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. జయవిక్రమ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి అశ్విన్ (13) ఔటయ్యాడు. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (67), అక్షర్ పటేల్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 421 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
390 పరుగుల ఓవరాల్ లీడ్ వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఫెర్నాండో బౌలింగ్‌లో జడేజా (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 59 ఓవర్ల తర్వాత టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్ 248/6గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (53), అశ్విన్ (1) ఉన్నారు.
గేర్ మార్చిన అయ్యర్.. మరో ఫిఫ్టి
స్కోర్ వేగం పెంచే క్రమంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గేర్ మార్చి ఆడుతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిధానంగా ఆడిన అతను.. క్రమంగా వేగం పెంచాడు. ఈ క్రమంలో 69 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధ సెంచరీ బాది టెస్ట్‌ల్లో ఈ మైలురాయిని మూడోసారి చేరుకున్నాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా 45 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 58.4 ఓవర్ల తర్వాత టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 247 పరుగలు చేసి ఓవరాల్‌గా 390 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.
రిషభ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి
రిషభ్ పంత్ టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (30 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా పంత్ కపిల్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఈ ఫీట్ సాధించిన అనంతరం అదే ఓవర్లో జయవిక్రమ బౌలింగ్‌లో అతినికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్ ఔట్ అయ్యే సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి ఓవరాల్‌గా 327 పరుగుల లీడ్‌లో కొనసాగుతొంది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా ఉన్నారు.
మరోసారి నిరుత్సాహపరిచిన కోహ్లి
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. తనకెంతో ప్రత్యేకమైన బెంగళూరు మైదానంలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే బంతిని అంచనా వేయడంలో మరోసారి విఫలమైన కోహ్లి (13).. ఈసారి జయవిక్రమ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఫలితంగా టీమిండియా 139 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతానికి భారత జట్టు282 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
వేగంగా పరుగులు సాధించే క్రమంలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. 98 పరుగుల వద్ద రోహిత్ వికెట్ కోల్పోయిన భారత్.. మరో 18 పరుగులు మాత్రమే జోడించి 116 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. జయవిక్రమ బౌలింగ్‌లో విహారి (35) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతానికి టీమిండియా 259 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. క్రీజ్‌లో విరాట్ (10), పంత్ ఉన్నారు.
భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన రోహిత్
టీమిండియా కెప్టెన్సీ చేపట్టాక బ్యాటింగ్‌లో మునపటిలా భారీ స్కోర్లు సాధించడంలేదన్న అపవాదును ఎదుర్కొంటున్న రోహిత్, ఈ మ్యాచ్‌లో కూడా ఆ అపవాదును కంటిన్యూ చేశాడు. ఈ ఏడాది స్వదేశంలో ఆడుతున్న ఆఖరి టెస్ట్ ఇన్నింగ్స్ లోనూ భారీ స్కోర్ సాధించలేక అభిమానులను నిరుత్సాహపరిచాడు. లంకతో రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ 46 పరుగులు చేసి ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి (27), విరాట్ ఉన్నారు. 30.1 ఓవర్ల తర్వాత టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్ 143 పరగుల లీడ్ కలుపుకుని) కొనసాగుతుంది.
204 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
రెండో రోజు టీ విరామ సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసి ఓవరాల్‌గా 204 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్ 143 పరుగులు కలుపుకుని) కొనసాగుతోంది. ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 22 పరుగులు) ఔట్ కాగా, రోహిత్ శర్మ (30), విహారి (8) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే మడతెట్టి, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా 42 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 185 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (20), హనుమ విహారి ఉన్నారు.
సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా
లంక జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ చేసిన అనంతరం టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ (2), మయాంక్ అగర్వాల్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
109 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక..
తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 109 పరుగులకే కుప్ప కూలింది. స్టార్‌పేసర్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశాడు. అదే విధంగా అశ్విన్, షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించాడు. శ్రీలంక బ్యాటర్లలో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
35 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 100/9
రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో లక్మల్ క్లీన్ బౌల్డ్ కాగా.. తరువాతి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో డిక్‌వాలా.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 35 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 100/9
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక..
రెండో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్మరే చేసిన లసిత్ ఎంబుల్దేనియా.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 33 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
రెండో రోజు ప్రారంభమైన ఆట
బెంగళూరు వేదికగా జరగుతోన్న పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో నిరోషన్ డిక్వెల్లా,లసిత్ ఎంబుల్దేనియా ఉన్నారు.
Related News By Category
Related News By Tags
-
దురంధర్ క్రేజ్.. మూవీని వీక్షించిన టీమిండియా
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్‌ను...
-
బీసీసీఐ కీలక ఆదేశాలు
ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడాల...
-
కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్ చేసిన తిలక్ వర్మ
టీమిండియా టీ20 స్టార్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇన్నాళ్లుగా భారత బ్యాటింగ్ దిగ్గజం ...
-
భారత్ భళా... సఫారీ డీలా
ధర్మశాల: ధర్మశాల అసలే శీతల ప్రదేశం. ఇక ఈ చలికాలమైతే మంచు గడ్డలా మారాల్సిందే. అలాంటి వేదికపై మన పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సెగ పెట్టారు. ఆరంభంలో పేస్ ప్రతాపం, తర్వాత స్పిన్ మాయాజాలం భారత్‌ను సి...
-
విజృంభించిన బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత్ 117 పరుగులకే ...


