రెండో టెస్టు: టీమిండియా భారీ విజయం | Sakshi
Sakshi News home page

టీమిండియా భారీ విజయం

Published Tue, Feb 16 2021 9:18 AM

India vs England 2021 Day 4 Highlights 2nd Test Telugu - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగులతో భారీ విజయం సాధించింది. 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో లంచ్‌ విరామానికి వెళ్లిన ఇంగ్లండ్‌ బ్రేక్‌ అనంతరం 164 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో మొయిన్‌ అలీ 43 పరుగులతో టాప్‌ స్కోర్‌రగా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్‌ 3, కల్దీప్‌ రెండు వికెట్లు‌ తీశారు. ఈ విజయంతో టీమిండియా అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న పింక్‌ టెస్టుకు నూతనోత్సహాంతో సిద్ధమవుతుంది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 329 ఆలౌట్‌‌,  రెండో ఇన్నింగ్స్‌ 286 ఆలౌట్‌
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్ 134 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 164 ఆలౌట్‌


లంచ్‌ విరామం అనంతరం ఇంగ్లండ్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 49వ ఓవర్‌లోనే ఎనియిదో వికెట్‌ కోల్పోగా.. మరోసారి అక్షర్ బౌలింగ్‌లోనే ఓలీ స్టోన్‌ ఎల్బీగా వెనుదిరగడంతో తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. లంచ్‌ అనంతరం రెండు వరుస ఓవర్లో రెండు వికెట్లు తీసిన అక్షర్‌ 5 వికెట్లు సాధించాడు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించిన 6వ బౌలర్‌గా అక్షర్‌ పటేల్‌ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్కోరు 149/9 గా ఉంది. మొయిన్‌ అలీ 28, బ్రాడ్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 48వ ఓవర్‌ 3 బంతిని కీపర్‌ ఫోక్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు యత్నించి అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 116 పరుగుల వద్ద 7వ వికెట్‌ కోల్పోయి లంచ్‌ విరామానికి వెళ్లింది. కెప్టెన్‌ రూట్‌ 33 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్లు మాత్రమే మిగిలిఉన్నాయి.

రెండో టెస్టులో టీమిండియా విజయానికి మరింత దగ్గరైంది. అక్షర్‌పటేల్‌ వేసిన 43వ ఓవర్‌ 5వ బంతిని భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ఓలీ పోప్‌ మిడ్‌వికెట్‌లో ఉన్న ఇషాంత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ 110 పరుగులు వద్ద 6వ వికెట్‌ కోల్పోయింది. 

రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయి ఓటమికి మరింత దగ్గరైంది. అశ్విన్‌ వేసిన 37వ ఓవర్‌ చివరి బంతికి 8 పరుగులు చేసిన బెన్‌ స్టోక్స్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 90 పరుగులు వద్ద ఐదో వికెట్‌ను కోల్పయింది. కాగా టీమిండియా విజయాని​కి ఇంకా 5 వికెట్ల దూరంలో ఉంది.

482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆచితూచి ఆడుతుంది. స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కెప్టెన్‌ జో రూట్‌, స్టోక్స్‌ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. 

ఇంగ్లండ​ జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 25వ ఓవర్ తొలి బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన డేనియల్‌ లారెన్స్‌ క్రీజును దాటి చాలా ముందుకు వచ్చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న పంత్‌ మెరుపువేగంతో స్టంప్‌ అవుట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 66 పరుగుల వద్ద 4వ వికెట్‌ కోల్పోయింది.

చెన్నై రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెపర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎడమ మోచేతికి గాయమైంది. మూడోరోజు ఫీల్డింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా గిల్‌ ఎడమ మోచేతికి వైద్యులు స్కానింగ్‌ ‌ చేశారు. ఈ నేపథ్యంలో గాయం కారణంగా గిల్‌ ఈరోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్యుల బృందం అతడిని పర్యవేక్షించాడు.‌

 
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్‌ విజయం దిశగా సాగుతోంది. నాలుగోరోజు 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. లారెన్స్‌ 25, రూట్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా 53/3 స్కోరు వద్ద  ఇంగ్లండ్‌ మూడో రోజు ఆటను ముగించిన సంగతి తెలిసిందే. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

తప్పక చదవండి

Advertisement