టీమిండియా విజయలక్ష్యం 195 పరుగులు

India Target Was 195 Runs In 2nd T20 Match Against Australia - Sakshi

సిడ్నీ : మాథ్యూ వేడ్‌ హాఫ్‌ సెంచరీకి తోడూ స్మిత్‌ కూడా రాణించడంతో రెండో టీ 20లో ఆసీస్‌ టీమిండియాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఏంచకున్న భారత్‌ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫించ్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌, మరో ఓపెనర్‌ డీఆర్సీ షాట్‌లు జట్టుకు శుభారంబాన్ని అందించారు. మొదటి 4 ఓవర్లలోనే 40 పరుగులు చేసిన ఆసీస్‌ .. 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డీఆర్సీ షాట్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు.

మరోవైపు ఆరంభం నుంచి దాటిగా ఆడిన వేడ్‌ 5వ ఓవర్‌లో ఠాకూర్‌ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను హార్ధిక్‌ జారవిడిచాడు. దీంతో 25 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. వేడ్‌కు జతకలిసిన స్టీవ్‌ స్మిత్‌ కూడా దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో 58 పరుగులు చేసిన వేడ్‌ సుందర్‌ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి ఠాకూర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 120 పరగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హెన్రిక్స్‌తో కలిసి స్మిత్‌ స్కోరును పరిగెత్తించాడు.

ఆసీస్‌ స్కోరు 168 పరుగులు వద్ద 46 పరుగుల చేసిన స్మిత్‌ చహల్‌ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కాసేపటికే 26 పరుగులు చేసిన హెన్రిక్స్‌ ను నటరాజన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత మార్కస్‌ స్టోయినిస్‌ మరో వికెట్‌ పడకుండా డేనియల్‌ సామ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజన్‌ 2, చహల్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top