Ravindra Jadeja: బంగ్లాతో టెస్టు సిరీస్‌.. జడేజా దూరమయ్యే అవకాశం! జట్టులోకి సూర్య?

Ind Vs Ban: Suryakumar In Line To Replace Jadeja Extra Batter Reports - Sakshi

India Tour Of Bangladesh 2022: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ సన్నిహిత వర్గాలు. బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా.. పరిమిత ఓవర్లలో మెరుగ్గా రాణిస్తున్న ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌కు టెస్టుల్లో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

మోకాలి గాయంతో బాధపడుతున్న జడ్డూ ఇంకా పూర్తిగా కోలుకోనట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్‌ టూర్‌ నాటికి పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోతే అతడు మరోసారి జట్టుకు దూరం కాక తప్పదు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ సహా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అందుబాటులో ఉన్నారు.


సూర్యకుమార్‌ యాదవ్‌

సౌరభ్‌ లేదంటే సూర్య?
ఈ జడ్డూ గైర్హాజరీ నేపథ్యంలో బౌలింగ్‌ విభాగంలో మరో స్పెషలిస్టు స్పిన్నర్‌ కావాలనుకుంటే సౌరభ్‌ కుమార్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలా కాకుండా ఎక్స్‌ట్రా బ్యాటింగ్‌ ఆప్షన్‌ కోసం వెదికినట్లయితే.. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. 

ఈ నేపథ్యంలో జడేజా స్థానాన్ని సూర్యతో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబరు 14 నుంచి బంగ్లాదేశ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా.. ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా జడేజా దూరమైతే మాత్రం.. కొత్తగా ఏర్పాటు కానున్న సెలక్షన్‌ కమిటీ సూర్యకు అవకాశం వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

సూర్య అదుర్స్‌.. త్వరలోనే వస్తా
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు మెరుగైన రికార్డు ఉంది. దేశవాళీ టోర్నీలో ఈ ముంబైకర్‌ 5 వేల పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు, 26 హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం. ఇక పొట్టి ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1కు చేరుకున్న సూర్య.. తనకు రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అనుభవం ఉందని.. త్వరలోనే టెస్టు క్యాప్‌ అందుకుంటానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌.

చదవండి: IND vs NZ: సలాం సూర్య భాయ్‌.. కోహ్లి రికార్డు బద్దలు! ఏకైక భారత ఆటగాడిగా
Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top