Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్‌ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే..

Ind Vs Ban 2nd Test: Kohli Furiously Stare To Pant But Fans Hails Him - Sakshi

Bangladesh vs India, 2nd Test - Virat Kohli- Rishabh Pant: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అసహనానికి గురయ్యాడు. సహచర ఆటగాడు రిషభ్‌ పంత్‌పై కన్నెర్ర చేశాడు. మిర్పూర్‌ టెస్టు శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(10), శుబ్‌మన్‌ గిల్‌(20) ఆరంభంలోనే పెవిలియన్‌ చేరారు.

ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా(24) కూడా తక్కువ స్కోరుకే అవుట్‌ కావడంతో.. క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లి ఆచితూచి ఆడాడు. లంచ్‌ బ్రేక్‌కు ముందు 36వ ఓవర్‌ చివరి బంతికి మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, రనౌట్‌ ప్రమాదాన్ని పసిగట్టిన పంత్‌.. క్రీజు నుంచి కదల్లేదు. కోహ్లిని వెనక్కి వెళ్లాల్సిందిగా సైగ చేశాడు.

రనౌట్‌ ప్రమాదం
కానీ అప్పటికే కోహ్లి క్రీజును వీడాడు. అయితే, వెంటనే వెనుదిరిగడంతో.. డైవ్‌ చేసి రనౌట్‌ తప్పించుకున్నాడు. కానీ, పంత్‌పై గుడ్లు ఉరిమి చూడగా.. పంత్‌ మాత్రం కూల్‌గానే ఉన్నాడు. ఇక లంచ్‌ తర్వాత టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కోహ్లి అవుటయ్యాడు. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. మరోవైపు.. కోహ్లి కాల్‌ కాదని సరైన నిర్ణయం తీసుకున్న పంత్‌.. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే పనిలో పడ్డాడు.

కోహ్లి మాట విని ఉంటే
ఈ క్రమంలో టీ సమయానికి పంత్‌ 86, అయ్యర్‌ 61 పరుగులతో క్రీజులో ఉండటంతో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 229 రన్స్‌ సాధించింది. కాగా కోహ్లి- పంత్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కోహ్లి అనవసరంగా పరుగుకు యత్నించాడు. ఇక్కడ తప్పు కోహ్లిదే. పంత్‌ సరైన నిర్ణయం తీసుకున్నాడు. పంత్‌.. కోహ్లి మాట విని ఉంటే టీమిండియా పరిస్థితి ఏమయ్యేదో?!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్‌!? ద్రవిడ్‌, నువ్వూ కలిసి..
IPL Auction- SRH: ఎన్ని కోట్లు పెట్టడానికైనా సిద్ధం! కెప్టెన్‌ ఆప్షన్‌.. సన్‌రైజర్స్‌ ప్రధాన టార్గెట్‌ అతడే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top