IPL 2023 Auction-SRH: ఎన్ని కోట్లు పెట్టడానికైనా సిద్ధం! కెప్టెన్‌ ఆప్షన్‌.. సన్‌రైజర్స్‌ ప్రధాన టార్గెట్‌ అతడే!

IPL 2023 Mini Auction: SRH Target Ben Stokes Captaincy Options Purse - Sakshi

IPL 2023 Mini Auction- Sunrisers Hyderabad: కేన్‌ విలియమ్సన్‌, నికోలస్‌ పూరన్‌ వంటి కీలక ఆటగాళ్లను రిలీజ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ఐపీఎల్‌ మినీ వేలం-2023లో కెప్టెన్‌ ఆప్షన్‌ కోసం టార్గెట్‌ చేయనుంది. జట్టులో ఉన్న 13 ఖాళీలను భర్తీ చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడనుంది. కాగా మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ ఖాళీలు కలిగి ఉన్న సన్‌రైజర్స్‌.. పర్సులో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి.

కెప్టెన్‌గా స్టోక్స్‌?
ఇంగ్లండ్‌ టెస్టు జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌పై సన్‌రైజర్స్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ క్రికెట్‌లోనూ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌తో కలిసి బజ్‌బాల్‌ విధానం అవలంబిస్తూ దూకుడైన ఆటతో.. జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు ఈ ఆల్‌రౌండర్‌.

ఆటగాడిగానూ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మినీ వేలంలో స్టోక్స్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య తీవ్రమైన పోటీ జరగడం ఖాయం. అయితే, గత సీజన్లలో వరుసగా కెప్టెన్లను మార్చినప్పటికీ సన్‌రైజర్స్‌ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. 

తొలుత డేవిడ్‌ వార్నర్‌.. ఇప్పుడు కేన్‌ విలియమ్సన్‌ను వదిలేసిన హైదరాబాద్‌ జట్టు స్టోక్స్‌ కోసం ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, సౌతాఫ్రికా స్టార్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే, సన్‌రైజర్స్‌ మాత్రం స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకొని కెప్టెన్‌ చేయాలనుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్‌-2023 మినీ వేలంలో సన్‌రైజర్స్‌ టార్గెట్‌ చేసే ప్రధాన ఆటగాళ్లు(అంచనా)
బెన్‌ స్టోక్స్‌
మయాంక్‌ అగర్వాల్‌
సామ్‌ కరన్‌
కామెరూన్‌ గ్రీన్‌

సన్‌రైజర్స్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు
అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2.6 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.5 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 6.5 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ. 4.2 కోట్లు ), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), ఫజల్హక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 4 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ. 4.2 కోట్లు), టి నటరాజన్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు)

వదిలేసిన ఆటగాళ్లు
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్‌ యువ బౌలర్‌ సూపర్‌స్టార్‌! స్టోక్స్‌, ఉనాద్కట్‌ కోసం పోటీ: మిస్టర్‌ ఐపీఎల్‌
IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top