‘టాప్‌’లోనే స్మృతి.. ఏడో ర్యాంక్‌కు హర్మన్‌ | ICC Womens ODI Rankings: Harmanpreet climbs to seventh, Mandhana stays at top | Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: ‘టాప్‌’లోనే స్మృతి.. ఏడో ర్యాంక్‌కు హర్మన్‌

Mar 18 2026 10:40 AM | Updated on Mar 18 2026 10:48 AM

ICC Womens ODI Rankings: Harmanpreet climbs to seventh, Mandhana stays at top

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒక స్థానం మెరుగు పరుచుకొని ఏడో ర్యాంక్‌కు చేరగా... వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్మృతి 790 పాయింట్లతో ‘టాప్‌’లో ఉండగా... ప్రస్తుతం హర్మన్‌ ఖాతాలో 652 ర్యాంకింగ్‌ పాయింట్లు ఉన్నాయి. 

జెమీమా రోడ్రిగ్స్‌ 635 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతోంది. టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతి 770 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉండగా... ఆ్రస్టేలియా ప్లేయర్‌ బెత్‌ మూనీ 787 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బౌలింగ్‌ విభాగంలో దీప్తి శర్మ 717 పాయింట్లతో భారత్‌ తరఫున అత్యుత్తమంగా నాలుగో ర్యాంక్‌లో ఉంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement