రాణించిన బట్లర్‌.. రెచ్చిపోయిన కాన్వే

The Hundred League: Conway Shines, As Manchester Originals Beat Southern Brave By 6 Wickets - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌ 2023లో భాగంగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 24) జరిగిన మ్యాచ్‌లో సథరన్‌ బ్రేవ్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఈ జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒరిజినల్స్‌ జోస్‌ బట్లర్‌ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

ఒరిజినల్స్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ మినహాయించి ఎవరూ పెద్దగా రాణించలేదు. మాడ్‌సన్‌ (22), సాల్ట్‌ (17), పాల్‌ వాల్టర్‌ (12), ఓవర్టన్‌ (0) రెండంకెల స్కోర్లు చేయగా.. లారీ ఈవాన్స్‌ (2), టామ్‌ హార్ట్లీ (2), హ్యారీసన్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమతమయ్యారు. బ్రేవ్‌ బౌలర్లలో తైమాల్‌ మిల్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. రెహాన్‌ అహ్మద్‌ 2, క్రిస్‌ జోర్డన్‌, అకెర్‌మ్యాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

రెచ్చిపోయిన కాన్వే..
131 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (40 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) రెచ్చిపోవడంతో బ్రేవ్‌ మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్‌), ఆకెర్‌మ్యాన్‌ (21 బంతుల్లో 24 నాటౌట్‌; 4 ఫోర్లు), ఫిన్‌ అలెన్‌ (4 బంతుల్లో 14; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించగా.. డు ప్లూయ్‌ (2), వెథర్లీ (0) విఫలమయ్యారు.

ఒరిజినల్స్‌ బౌలర్లలో జమాన్‌ ఖాన్‌ 2, జోష్‌ టంగ్‌, ఆస్టన్‌ టర్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, హండ్రెడ్‌ లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. మరో బెర్త్‌ కోసం మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌, సథరన్‌ బ్రేవ్‌ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. మిగతా జట్లన్నీ ఎలిమినేట్‌ అయ్యాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top