అప్పట్లో 5 సిక్సర్లు బాదాడు: రింకూపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | Hit 5 Sixes In 5 Balls Ages Ago: Rinku Singh Ridiculed By WC Winner | Sakshi
Sakshi News home page

అప్పట్లో 5 సిక్సర్లు బాదాడు అంతే: రింకూపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Apr 15 2026 2:38 PM | Updated on Apr 15 2026 2:43 PM

Hit 5 Sixes In 5 Balls Ages Ago: Rinku Singh Ridiculed By WC Winner

రింకూ సింగ్‌ (PC: PTI)

ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. చెన్నై విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.

తద్వారా ఇప్పటికి ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కేకేఆర్‌ ఇంత వరకు బోణీ (ఒక​ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు) కొట్టలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రూ. 25 కోట్ల ఆటగాడు కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green), కెప్టెన్‌ అజింక్య రహానే, వైస్‌ కెప్టెన్‌ రింకూ సింగ్‌పై అభిమానులు సైతం మండిపడుతున్నారు.

విధ్వంసకర బ్యాటర్‌ కాదు
ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ రింకూ సింగ్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘రింకూ సింగ్‌ విధ్వంసకర బ్యాటర్‌ కాదు. అప్పుడెప్పుడో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదాడు. ఇప్పటికీ దాని గురించి మనం మాట్లాడుకుంటాము.

కానీ ఇప్పుడు అతడు స్ట్రైక్‌ రొటేట్‌ చేసేందుకు మాత్రమే చూస్తున్నాడు. అయినప్పటికీ బ్యాటింగ్‌ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. రన్‌రేటు 10- 12కు పెరిగి పోతున్నా అతడు జట్టు కోసం ఏమీ చేయలేకపోతున్నాడు.

ఫినిషర్‌గా మాత్రమే రాణించగలడు
బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడో స్థానమే అతడికి సరైంది. ఫినిషర్‌గా మాత్రమే రాణించగలడు. ఐదు ఓవర్లలో యాభై పరుగులు అవసరమైన వేళ అతడు అద్భుతం చేయగలడేమో!.. కానీ ఐదో స్థానంలో వచ్చి ఇన్నింగ్స్‌ నిర్మించడంలో అతడు దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఈ పాత్రలో ఏమాత్రం సరిపోడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఫైర్‌ అయ్యాడు.

12 బంతులలో 6 పరుగులే
బ్యాటర్ల వైఫల్యం వల్లే కేకేఆర్‌కు వరుస ఓటములు ఎదురవుతున్నాయన్న చిక్కా.. అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఒక్కడే మెరుగ్గా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా చెన్నైతో మ్యాచ్‌లో రింకూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 12 బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేసి అవుటయ్యాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో రమణ్‌దీప్‌ సింగ్‌ కేకేఆర్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌ (35)గా నిలిచాడు.

చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement