Tokyo Olympics: జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అర్హత

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి మహిళా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2019 ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో వాల్ట్ విభాగంలో ప్రణతి కాంస్య పతకం సాధించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల ప్రణతి మే 29 నుంచి జూన్ 1 వరకు చైనాలోని హాంగ్జౌలో ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ను రద్దు చేశారు. దాంతో 2019 ఆసియా ఈవెంట్‌లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రణతి సాధించిన ర్యాంకింగ్ పాయింట్ల ను నిలబెట్టుకుంది. తద్వారా ఆమెకు ఆసియా జోన్ నుంచి టోక్యో బెర్త్ ఖాయమైంది.