IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టి ఉందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!

Gujarat Titans Won Their First IPL Trophy On May 29 2022, IPL 2023 Final Scheduled On Same Day 2023 - Sakshi

గుజరాత్‌-చెన్నై జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. యాదృచ్చికమో ఏమో తెలీదు కానీ, సరిగ్గా ఇదే రోజే గతేడాది ఐపీఎల్‌ (2022) ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపొంది, అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ నెగ్గింది. 

వరుణుడి ఆటంకం కారణంగా (షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మే 28న జరగాల్సి ఉంది) సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే రోజు టైటిల్‌ గెలిచే అవకాశం గుజరాత్‌కు వచ్చింది. రిజర్వ్‌ డేకు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటంతో ఈసారి కూడా గుజరాత్‌కే టైటిల్‌ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మళ్లీ అదే రోజు (మే 29) టైటిల్‌ గెలవాలని వారికి రాసి పెట్టిందో ఏమో, అన్నీ వారికి అనుకూలంగా జరుగుతున్నాయి.  మరోవైపు మ్యాచ్‌ పూర్తిగా జరిగినా లేక అరకొరగా సాధ్యపడినా గుజరాత్‌కే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ గుజరాత్‌ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. 

చెన్నైతో పోలిస్తే తమ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, శుభ్‌మన్‌ గిల్‌ భీకర ఫామ్‌ కొనసాగిస్తాడని.. లీగ్‌ టాప్‌-3 వికెట్‌టేకర్లు షమీ, రషీద్‌, మోహిత్‌ మరోసారి సత్తా చాటుతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత రికార్డులు, లక్‌ కూడా తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి గుజరాత్‌ అభిమానులు ప్రచారం చేసుకున్నట్లుగా హార్ధిక్‌ సేన గెలుస్తుందో, లేక మెజారిటీ శాతం అభిమానుల కోరిక ప్రకారం సీఎస్‌కే టైటిల్‌ గెలుస్తుందో వేచి చూడాలి. కాగా, నిబంధనల ప్రకారం రిజర్వ్‌ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోతే, లీగ్‌ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే (గుజరాత్‌) విజేతగా ప్రకటిస్తారు.

చదవండి: IPL 2023 Final: 'రిజర్వ్‌ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top