169 నాటౌట్‌.. అయినా గెలిపించలేకపోయాడు

Goa Lost The Match By 2 Runs Against Hyderabad In Vijay Hazare Trophy - Sakshi

సూరత్‌: దేశవాలీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోపీలో లీగ్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతుండగా.. మరికొన్ని మాత్రం ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా ఆదివారం ఎలైట్‌ గ్రూఫ్‌ ఏలో భాగంగా హైదరాబాద్‌, గోవాల మధ్య లీగ్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. బంతి బంతికి ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో గోవా విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఓపెనర్‌గా వచ్చిన గోవా ఓపెనర్‌ ఏక్‌నాథ్‌ కేర్కర్‌ 169 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కూడా మ్యాచ్‌ను గెలిపించకలేకపోయాడు.

కాగా మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌(150 పరుగులు), తిలక్‌ వర్మ( 128 పరుగులు) సెంచరీలతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా‌ జట్టును ఓపెనర్‌ కేర్కర్‌ విజయం దిశగా నడిపించాడు. అతనికి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ స్నేహాల్‌ సుహాస్‌ (116 పరుగులతో) చక్కని సహకారం అందించాడు. అయితే సుహాస్‌ ఔటైన తర్వాత కేర్కర్‌ ఒంటరిపోరాటం చేస్తూ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అయితే ఆఖరి ఓవర్లలో హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది. దీంతో గోవా విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయింది.
చదవండి: రెండు రన్స్‌తో డబుల్‌ సెంచరీ మిస్‌.. కేకేఆర్‌లో జోష్‌
దుమ్మురేపిన అశ్విన్‌.. కెరీర్‌ బెస్ట్‌కు రోహిత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top