నీ పాటలో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుంది: మ్యాక్స్‌వెల్‌

Glenn Maxwell Hilarious Twist To AB De Villiers Song For Father Birthday - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వినూత్న రీతిలో కామెంట్‌ చేశాడు. ఏబీ తన నాన్న బర్త్‌డే సందర్భంగా పాడిన పాటలో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుందని ట్రోల్‌ చేశాడు. విషయంలోకి వెళితే.. మే 29న డివిలియర్స్‌ నాన్న 70వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన నాన్నకు ఏదో ఒక గిఫ్ట్‌ ఇవ్వాలని భావించిన ఏబీ తన భార్యతో కలిసి ఫెవరెట్‌ సాంగ్‌ను పాడాడు. పాప్‌ సింగర్‌ జాసన్‌ రాజ్‌ పాపులర్‌ సాంగ్‌ ' ఐ వోంట్‌ గివ్‌ అప్‌'ను నాన్నాకు అంకితం చేశాడు. ఈ సందర్భంగా ఏబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్‌ చేస్తూ ఒక పోస్టును షేర్‌ చేశాడు.

''మా నాన్న 70వ బర్త్‌డే వేడుకలను చాలా ఆనందంగా జరుపుకున్నాం. నా ఆల్‌టైమ్‌ ఫెవరెట్‌ సాంగ్‌ ఐ వోంట్‌ గివ్‌ అప్‌ను నా భార్యతో కలిసి పాడాను. ఈ పాటలో ఎంత అర్థం ఉంటుందంటే.. ఏం ప్రమాదం జరిగినా మనకు దేవుడు అండగా ఉంటాడని నమ్మకం. ఇన్నేళ్లలో నాకు రోల్‌ మోడల్‌గా నిలిచిన మా నాన్నకు ఈ పాటను అంకితం చేయడం సంతోషంగా ఉన్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఏబీ పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమై స్పందన లభించింది. అయితే ఇదే పాటను ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆడుతున్నప్పుడు మే1వ తేదీన పాడాడు.  డివిలియర్స్‌  ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌సీబీలోనే మ్యాక్స్‌వెల్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డివిలియర్స్‌ పాడిన పాటను మ్యాక్స్‌వెల్‌ ట్రోల్‌ చేశాడు. ''ఏబీ.. నీ పాటలో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుంది.. గతంలో పాడిన దానికంటే అద్భుతంగా ఉంది'' అంటూ కామెంట్‌ చేశాడు.

ఇక డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ తొలిసారి ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున కలిసి ఆడారు. ఈ సీజన్‌లో ఈ ఇద్దరు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆర్‌సీబీ గెలిచిన మ్యాచ్‌ల్లో వీరి పాత్ర కీలకం అని చెప్పొచ్చు. 7 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌ 223 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్‌ 7 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేశాడు. కరోనా మహమ్మారి సెగతో బీసీసీఐ ఐపీఎల్‌ 14వ సీజన్‌ను మధ్యలోనే రద్దు చేసింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా తరపున ఏబీ డివిలియర్స్‌ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఏబీ క్లారిటీ ఇస్తూ.. టీ20 ప్రపంచకప్‌ ఆడేది లేదని.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.
చదవండి: Veda Krishnamurthy: వాళ్లతోనే నా సర్వస్వం కోల్పోయా..

బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్‌ చేసిన రషీద్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top