#SKY.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా! | Fans Praise-Suryakumar Yadav 25 Balls-57 Runs Terrific Innings Vs PBKS | Sakshi
Sakshi News home page

#SKY.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!

Apr 22 2023 11:19 PM | Updated on Apr 22 2023 11:52 PM

Fans Praise-Suryakumar Yadav 25 Balls-57 Runs Terrific Innings Vs PBKS - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి మెరిశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఓడినప్పటికి తాను మాత్రం గెలిచినట్లే.  

25 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేసి పాత సూర్యను తలపించాడు. ముఖ్యంగా మిస్టర్‌ 360 అని పేరున్న సూర్య.. చాలాకాలం తర్వాత తన స్టైల్‌ ఆటను చూపించాడు. టి20 ప్రపంచకప్‌లో ఎలా చెలరేగాడో అచ్చం అలానే ఇవాళ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆడడం విశేషం. 

టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత తన ఫామ్‌ కోల్పోయిన సూర్య.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లు హ్యాట్రిక్‌ గోల్డెన్‌ డకౌట్‌లు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదే రకమైన ఆటతీరును కనబరుస్తూ విమర్శలు మూటగట్టుకున్నాడు. కానీ ఇవాళ్టి ఇన్నింగ్స్‌తో సూర్య ఫామ్‌లోకి వచ్చినట్లేనా అని అభిమానులు పేర్కొన్నారు. ''ఒకవేళ మిస్టర్‌ 360.. SKY..ఫామ్‌లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి జట్లకు మూడినట్లే.   ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నాడంటే ఇక ఆపడం ఎవరి తరం కాదు. '' అని కామెంట్‌ చేశారు. రానున్న మ్యాచ్‌ల్లో సూర్య ఫామ్‌లోకి వచ్చాడా లేక ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడా అన్నది తేలుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement