ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం | Eng Vs NZ 2nd Test: England Name 2 Debutants In Playing XI | Sakshi
Sakshi News home page

ENG vs NZ: ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

Jun 15 2026 8:56 PM | Updated on Jun 15 2026 9:01 PM

Eng Vs NZ 2nd Test: England Name 2 Debutants In Playing XI

న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం అందుకుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో పర్యాటక కివీస్‌ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్‌ 17) నుంచి లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగారెండో టెస్టు మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. నైట్‌క్లబ్‌ వివాదం నేపథ్యంలో రెగ్యులర్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌పై వేటు వేసిన బోర్డు.. అతడి స్థానంలో రెండో టెస్టుకు వెటరన్‌ ప్లేయర్‌ జో రూట్‌ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపింది.

ఇద్దరి అరంగేట్రం
ఇక కివీస్‌తో రెండో టెస్టు సందర్భంగా తమ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నట్లు ఈసీబీ వెల్లడించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోర్డాన్‌ కాక్స్‌, హాంప్‌షైర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సోనీ బేకర్‌ టెస్టుల్లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది.

కాగా జోర్డాన్‌ ఇప్పటికే ఇంగ్లండ్‌ తరఫున మూడు వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు.. బేకర్‌ ఇప్పటికి రెండు వైట్‌బాల్‌ మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, చివరగా అతడు 2025లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. ఇక జోర్డాన్‌ ఎనిమిది నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా రెండో టస్టు సందర్భంగా జట్టుతో చేరుతున్నాడు. కాగా నైట్‌క్లబ్‌ వివాదంలో స్టోక్స్‌తో పాటు ఆల్‌రౌండర్‌ గస్‌ అట్కిన్సన్‌ మీద కూడా వేటు పడింది. ఇక ఓలీ రాబిన్సన్‌ను విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో జోర్డాన్‌, బేకర్‌, ఆర్చర్‌ తుదిజట్టులోకి వచ్చారు.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు
జో రూట్‌ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, సోనీ బేకర్‌, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్‌, జోర్డాన్‌ కాక్స్‌, బెన్‌ డకెట్‌, మ్యాట్‌ ఫిషర్‌, ఎమీలియో గే, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), జోష్‌ టంగ్‌.

చదవండి: శ్రీలంకప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌ సూర్యవంశీ.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement