'రోహిత్‌ ఇది‌​ నాది.. వెళ్లి సొంత బ్యాట్‌ తెచ్చుకో'

Dream 11 Promotional Video On Rohith Sharma Became Viral - Sakshi

దుబాయ్‌ : రోహిత్‌ శర్మ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు.. అందుకే అతన్ని ముద్దుగా హిట్‌మ్యాన్‌ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రోహిత్‌ శర్మకు సొంత బ్యాట్‌ కూడా లేదంట. అదేంటి.. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం దుబాయ్‌లో ఉన్నాడు కదా.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ వద్ద సొంత బ్యాట్‌ లేకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ 2020కి సంబంధించి డ్రీమ్‌ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వివో తప్పుకున్న నేపథ్యంలో ఏడాది కాలానికి గానూ రూ.250 కోట్లతో డ్రీమ్‌ లెవెన్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది.(చదవండి : స్టోక్స్‌ ఆడతాడో... లేదో...!) 

ఈ సందర్భంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లతో ప్రమోషనల్‌ వీడియోలు చేస్తున్న డ్రీమ్‌ 11 సంస్థ తాజాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రమోషనల్‌ వీడియో ఒకటి విడుదల చేసింది. ఆ వీడియోలో రోహిత్‌ గల్లీ క్రికెట్‌ ఆడుతుంటాడు. చేతిలో బ్యాట్‌ పట్టుకొని హిట్టింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న రోహిత్‌ను ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావ్‌ అని అడుగుతాడు.. దానికి ఓపెనింగ్‌ చేస్తున్నా అంటూ హిట్‌మ్యాన్‌ సమాధానమిస్తాడు. ఎంతైనా తాను ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను కదా అంటూ నవ్వుతూ పేర్కొంటాడు. దీనికి అవతలి వ్యక్తి నీ చేతిలో ఉన్న బ్యాట్‌ ఎవరిది అని అడుగుతాడు.. దానికి రోహిత్‌ తటపటాయిస్తూ.. బ్యాట్‌ నీదేనా అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి రోహిత్‌ చేతిలో ఉన్న బ్యాట్‌ లాక్కుంటూ.. అవును బ్యాట్‌ నాదే.. వెళ్లి నీ సొంత బ్యాట్‌ తెచ్చుకో.. అప్పటివరకు ఫీల్డింగ్‌ చేయ్‌ అంటూ పక్కకు నెట్టేస్తాడు. దాంతో రోహిత్‌ బిత్తరచూపులు చూస్తుండగా వీడియో ముగుస్తుంది. (చదవండి : షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా)

దీనిపై ముంబై ఇండియన్స్‌ సహచరుడు , బౌలర్‌ జస్‌ప్రీత్‌  బుమ్రా వీడియో ట్విటిర్‌లో షేర్‌ చేస్తూ కామెంట్‌  చేశాడు. రోహిత్‌ బాయ్‌.. అది మన క్రికెట్‌ కాదు.. గల్లీ క్రికెట్‌. నీ సొంత బ్యాట్‌ తెచ్చుకొని బరిలోకి దిగు.. అంటూ కామెంట్‌ జత చేశాడు. బుమ్రా షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  కాగా సెప్టెంబర్‌ 19న మొదలుకానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-09-2020
Sep 24, 2020, 23:06 IST
దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్స్‌ చాలెంజర్స్‌.. కింగ్స్‌  పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది....
24-09-2020
Sep 24, 2020, 22:19 IST
దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  207 పరుగుల టార్గెట్‌లో...
24-09-2020
Sep 24, 2020, 21:25 IST
దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత...
24-09-2020
Sep 24, 2020, 20:22 IST
ముంబై: ప్రముఖ వ్యాఖ్యాత, ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ గుండె పోటుకు గురై ఈరోజు(గురువారం) తుదిశ్వాస విడిచిన సంగతి...
24-09-2020
Sep 24, 2020, 18:29 IST
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ కన్నుమూశారనే వార్త క్రికెట్‌ ప్రపంచాన్ని  కలవరానికి గురి చేసింది....
24-09-2020
Sep 24, 2020, 17:51 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆడతాడా.. లేదా అనే దానికి క్లారిటీ...
24-09-2020
Sep 24, 2020, 17:25 IST
ముంబై: గత కొంతకాలంగా బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ ఉదంతం ఇప్పుడు క్రికెట్‌కు కూడా పాకినట్లుంది.  కొంతమంది క్రికెటర్లు డ్రగ్స్‌ తీసుకున్నారంటూ...
24-09-2020
Sep 24, 2020, 16:10 IST
ముంబై:  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59)ఇకలేరు. ఈరోజు గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్‌ కన్నుమూశారు. ప్రస్తుతం...
24-09-2020
Sep 24, 2020, 15:59 IST
షార్జా: ఐపీఎల్‌-13లో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే....
24-09-2020
Sep 24, 2020, 14:01 IST
లండన్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో చెన్నై మ్యాచ్‌ ఆడి రెండు రోజులు గడుస్తున్నా ఎంఎస్‌ ధోని...
24-09-2020
Sep 24, 2020, 11:50 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కోల్‌కతాపై విజయం తమ జట్టులో జోష్‌ నింపిందని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...
24-09-2020
Sep 24, 2020, 10:20 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ పూర్తిగా విఫలమైన వేళ...
24-09-2020
Sep 24, 2020, 09:04 IST
అబుదాబి : 2019 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను రూ. 15 కోట్లకు...
24-09-2020
Sep 24, 2020, 07:55 IST
దుబాయ్ ‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ధోని భార్య సాక్షి సింగ్‌ ఐపీఎల్‌లో అంపైరింగ్‌ తప్పిదాలపై విమర్శించింది. ఆ వెంటనే...
24-09-2020
Sep 24, 2020, 05:10 IST
కోల్‌కతాపై గెలిచిన ముంబై లీగ్‌లో ఖాతా తెరిచింది.  తమ రెండో మ్యాచ్‌లో ఇటు బ్యాట్‌తో... అటు బంతితో కోల్‌కతా నైట్‌రైడర్స్‌...
23-09-2020
Sep 23, 2020, 23:44 IST
అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించి ఖాతా తెరిచింది. చెన్నై సూపర్‌...
23-09-2020
Sep 23, 2020, 21:42 IST
అబుదాబి: ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపులతో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట టాస్‌ గెలిచి...
23-09-2020
Sep 23, 2020, 20:30 IST
అబుదాబి: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ...
23-09-2020
Sep 23, 2020, 19:43 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఏడో...
23-09-2020
Sep 23, 2020, 19:12 IST
అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌ని ఓటమితో ఆరంభించిన ముంబై ఇండియన్స్‌ బుధవారం మరో బిగ్‌ఫైట్‌కు రెడీ అయింది. హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top