'ఒక్క డకౌట్‌తో నేనేం చెడ్డవాడిని కాను'

Dinesh Karthik Says Single Duck Doesnt Make Player Bad - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భోణీ కొట్టడం పట్ల ఆ జట్టు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. అయితే ఇదే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయ్యాడు. ఇదే విషయమై కార్తీక్‌ స్పందిస్తూ. కేవలం ఒక్క డకౌట్‌ ఏ ఆటగాడికి చెడ్డ పేరు తీసుకురాలేదన్నాడు.. తన అంశంలోనూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శుభమన్‌ గిల్‌ను కార్తీక్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు. (చదవండి : ఎవరిని నిందించొద్దు.. తప్పంతా నాదే : వార్నర్‌)

'శుబ్‌మన్‌ గిల్‌ కీలకం అవుతాడని ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే అనుకున్నాం. గిల్‌ తన జర్నీని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా.  అతని స్ట్రోక్‌ప్లే అద్భుతంగా ఉంది., 21 ఏళ్ల వయసున్న శుబ్‌మన్‌ గిల్‌ భవిష్యత్తులో గొప్ప ఆటగాడు అవుతాడని బలంగా నమ్ముతున్నా. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మా జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. హిట్టర్లుగా పేరున్న కేకేఆర్‌కు యువ ఆటగాళ్ల బలం కూడా ఎక్కువగానే ఉంది. జట్టులో ఆల్‌రౌండర్లకు కొదువ లేకపోవడం.. కమిన్స్‌ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. మొదటి మ్యాచ్‌లో విఫలమైనందుకు కమిన్స్‌ మీద ట్రోల్‌ చేసినవారికి తన ప్రదర్శనతోనే సమాధానం ఇచ్చాడు. అంటూ' తెలిపాడు.

ఈ మ్యాచ్‌ ద్వారా కమలేశ్‌ నాగర్‌కోటి మళ్లీ కేకేఆర్‌కు ఆడడం లాభాదాయకమని కార్తీక్‌ వెల్లడించాడు. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌లో ఉంటున్న నాగర్‌కోటితో మాకు మంచి ఎమోషనల్‌ జర్నీ ఉంది. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా గాయపడిన నాగర్‌కోటి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ దిగి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2018లో కేకేఆర్‌ నాగర్‌కోటిని కొనుగోలు చేసింది. కాగా కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30(బుధవారం) రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. (చదవండి : 'అనుష్క జీ.. ఆయన వయసుకు గౌరవమివ్వండి')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top