కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ముందు భారత్‌కు వరుస షాక్‌లు.. డోప్‌ టెస్ట్‌లో పట్టుబడ్డ మరో అథ్లెట్‌

Days Ahead Of Commonwealth Games, Another Indian Athlete Fails Dope Test - Sakshi

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్న కామన్‌వెల్త్‌ క్రీడా సంగ్రామానికి ముందు భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్‌ టెస్ట్‌లో విఫలమై మెగా ఈవెంట్‌ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మరో అథ్లెట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్‌ వచ్చినట్టు తెలుస్తోంది.

మహిళల 4x100 మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు (ఇదివరకే ఈ విభాగంలో ఓ సభ్యురాలు డోప్ టెస్టులో విఫలమైంది) డోప్ టెస్ట్‌లో  పట్టుబడినట్లు అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి ధృవీకరించారు.

అయితే ఆ అథ్లెట్ పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కాగా, గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు (అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లై) సహా మరో ఇద్దరు భారత అథ్లెట్లు (స్ప్రింటర్ ధనలక్ష్మీ,  ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబు)  డోప్ టెస్ట్‌లో విఫలమైన విషయం తెలిసిందే. తాజా ఘటనతో భారత బృందంలో డోపీల సంఖ్య 5కు చేరింది. 
చదవండి: డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్‌’ అథ్లెట్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top