సిడ్నీ టెస్టుకు డేవిడ్‌ వార్నర్‌ రెడీ | David Warner return to Australia squad for third Test | Sakshi
Sakshi News home page

సిడ్నీ టెస్టుకు డేవిడ్‌ వార్నర్‌ రెడీ

Dec 31 2020 5:19 AM | Updated on Dec 31 2020 5:19 AM

David Warner return to Australia squad for third Test - Sakshi

పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బందులు పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కాస్త ఊరట! గజ్జల్లో గాయంతో ఆటకు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. మూడో టెస్టు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం ప్రకటించిన జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. అతనితో పాటు విల్‌ పకోవ్‌స్కీ, సీన్‌ అబాట్‌లను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరంతా గురువారం సాయంత్రం ఆసీస్‌ జట్టుతో చేరి సిడ్నీ టెస్టు కోసం ప్రాక్టీస్‌ మొదలు పెడతారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన ఓపెనర్‌ జో బర్న్స్‌పై వేటు పడింది. మూడో టెస్టు వేదికగా సిడ్నీ ఖరారు అయినా... సిడ్నీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షల కారణంగా  భారత్, ఆసీస్‌ జట్లు వెంటనే అక్కడికి వెళ్లడం లేదు. జనవరి 4 వరకు ఆటగాళ్లంతా మెల్‌బోర్న్‌లో ఉండి ప్రాక్టీస్‌ కొనసాగిస్తారని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్‌ హాక్లీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement