Rashid Khan: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్‌రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్‌లో ప్రకటించింది.
కాగా కాబుల్ ఆత్మాహుతి ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు. ఇక కాబుల్‌లోని ఆసుపత్రిలోని ఐసియు వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్‌తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్‌బ్రేకింగ్ ఫోటో'' అంటూ కామెంట్ చేశారు.
Kabul Suicide Attack: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి
Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc
— Rashid Khan (@rashidkhan_19) September 30, 2022
💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv
— Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022