లంక ప్రీమియర్‌ లీగ్‌ క్రికెటర్లకు కరోనా

Corona Fear In Sri Lanka Premier league - Sakshi

కొలంబో : మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)ను కరోనా వైరస్‌ తాకింది. లీగ్‌లో క్యాండీ టస్కర్స్‌ ఫ్రాంచైజీకి చెందిన పాకిస్తాన్‌ ప్లేయర్‌ సొహైల్‌ తన్వీర్, కొలంబో కింగ్స్‌ జట్టు సభ్యుడు, కెనడా బ్యాట్స్‌మన్‌ రవీందర్‌పాల్‌ సింగ్‌ ఇద్దరూ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ టోర్నీ కోసం శ్రీలంక చేరిన ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో వీరిద్దరూ పాజిటివ్‌గా తేలారు. దీంతో కనీసం రెండు వారాల పాటు లీగ్‌కు దూరం కానున్నారు. ఈ నెల 26న ఎల్‌పీఎల్‌ తొలి సీజన్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ లీగ్‌ నుంచి స్టార్‌ క్రికెటర్లు క్రిస్‌ గేల్, లసిత్‌ మలింగ, సర్ఫరాజ్‌ అహ్మద్, రవి బొపారా తదితరులు వైదొలిగారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top