Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్..

జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్‌లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 2.5–0.5; 2–0తో అర్జున్‌పై గెలిచి విజేతగా అవతరించాడు.
ఆదివారం జరిగిన రెండో ఫైనల్ రెండు గేముల్లోనూ కార్ల్‌సన్ గెలిచాడు. కార్ల్‌సన్‌కు 33,500 డాలర్లు (రూ. 27 లక్షల 21 వేలు), అర్జున్‌కు 21,250 డాలర్లు (రూ. 17 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
చదవండి: National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
మరిన్ని వార్తలు