National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ | National Games 2022: Akula Sreeja won two silver medals | Sakshi
Sakshi News home page

National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ

Sep 25 2022 4:45 AM | Updated on Sep 25 2022 4:45 AM

National Games 2022: Akula Sreeja won two silver medals - Sakshi

జాతీయ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్‌ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం టీటీ ఈవెంట్‌ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్‌ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్‌ ఉత్పల్‌ షా–కృత్విక సిన్హా రాయ్‌ (గుజరాత్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్‌) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement