BWF Championships: ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన శంకర్‌ ముత్తుస్వామి

BWF World Junior Championships 2022: Sankar Muthusamy Won Silver - Sakshi

శంకర్‌కు రజత పతకం

సాంటెండర్‌ (స్పెయిన్‌): ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌ –19 పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత టీనేజర్‌ శంకర్‌ ముత్తుస్వామి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైకు చెందిన 18 ఏళ్ల శంకర్‌ 14–21, 20–22తో కువాన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు.

30 ఏళ్ల ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో రజత పతకం నెగ్గిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా శంకర్‌ నిలిచాడు. గతంలో జూనియర్‌ మహిళల సింగిల్స్‌లో అపర్ణ పోపట్‌ (1996లో), సైనా (2006లో)... జూనియర్‌ పురుషుల సింగిల్స్‌లో సిరిల్‌ వర్మ (2015) ఫైనల్లో ఓడి రజతం సాధించారు. 2006లో రన్నరప్‌గా నిలిచిన సైనా 2008లో విజేతగా నిలువగా... గురుసాయిదత్‌ (2008లో), సాయిప్రణీత్, ప్రణయ్‌ (2010లో), సమీర్‌ వర్మ (2011లో), లక్ష్య సేన్‌ (2018లో) సెమీఫైనల్లో ఓడి కాంస్యాలు గెలిచారు. 

చదవండి: Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top