రిటైర్మెంట్ ప్రకటించిన సన్‌రైజర్స్‌ బౌలర్‌!

Bipul Sharma retires from domestic cricket - Sakshi

భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బిపుల్ శర్మ దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అమెరికా తరుపున ఆడేందుకు బిపుల్ శర్మ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డొమిస్టిక్‌ క్రికెట్‌లో పంజాబ్‌, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌ తరుపున బిపుల్ శర్మ ఆడాడు.105 టీ20 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ 1203 పరుగులతో పాటు, 84 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌-2010 సీజన్‌కు గాను బిపుల్ శర్మ పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.

ఈ సీజన్‌లో 104 పరుగులతో పాటు, 8వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున 18 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ శర్మ 83 పరుగులతో పాటు, 9వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 33 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ శర్మ 187 పరుగులతో పాటు, 17వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అమెరికా తరుపున ఉన్ముక్త్ చంద్ కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022 Auction: సెంచరీతో మెరిశాడు.. వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top