భారత్‌తో టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్న స్టోక్స్‌ | Ben Stokes Takes Indefinite Break From Cricket | Sakshi
Sakshi News home page

భారత్‌తో టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్న స్టోక్స్‌

Jul 31 2021 5:24 AM | Updated on Jul 31 2021 5:24 AM

Ben Stokes Takes Indefinite Break From Cricket - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆందోళనకు గురవుతున్న తాను, కొంత సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత్‌తో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అతను ఆడబోవడం లేదు. గత ఏడాది కాలంలో ‘బయో బబుల్‌’ల కారణంగా స్టోక్స్‌ ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నాడు.  స్టోక్స్‌ స్థానంలో క్రెయిగ్‌ ఓవర్టన్‌ను ఇంగ్లండ్‌ జట్టులోకి ఎంపిక చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement