పాక్‌ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల | Australia to tour Pakistan for three ODIs in May, June | Sakshi
Sakshi News home page

పాక్‌ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల

May 7 2026 10:23 AM | Updated on May 7 2026 10:37 AM

Australia to tour Pakistan for three ODIs in May, June

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మరోసారి పాకిస్తాన్‌ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఇవాళ విడుదలైంది.

తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్‌ 2, 4 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.

స్టార్ ఆటగాళ్లపై సందేహాలు
పాక్‌ సిరీస్‌ ఐపీఎల్‌ ముగింపు సమయానికి  ప్రారంభమవుతుండటంతో ఆసీస్‌ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.

ప్రపంచకప్‌కు ముందు టీ20 సిరీస్‌
ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఆ సిరీస్‌ను పాక్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేయడం విశేషం.

బంగ్లాదేశ్ చేతిలో ఓటమి
ఇటీవల పాక్‌ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌ కోసం పాక్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది.

రేపటి నుంచి టెస్ట్‌ సిరీస్‌
ప్రస్తుతం పాక్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌ సిల్హెట్‌ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.

తర్వాత బంగ్లాదేశ్ టూర్
పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement