AFG Vs SL Super-4: పాక్‌ టార్గెట్‌ 130.. ఇక బౌలర్లపైనే భారం

Asia Cup: Pakistan Need 130 Runs Win Bowlers Restricted AFG 129 Runs - Sakshi

ఆసియాకప్‌ టోర్నీలో సూపర్‌-4 లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆఫ్గన్‌ బ్యాటర్లు పరుగులు తీయడంలో ఇబ్బంది పడ్డారు. అఫ్గనిస్తాన్‌ బ్యాటర్లలో ఇబ్రహీ జర్దన్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హజరతుల్లా జజేయ్‌ 21, రహమనుల్లా గుర్బాజ్‌ 17 పరుగులు చేశారు.


పాకిస్తాన్‌ బౌలర్లలో హారిస్‌ రౌఫ్‌ 2, నసీమ్‌ షా, మహ్మద్‌ హుస్నైన్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.కాగా ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ గెలుపుపైనే భారత్‌ ఫైనల్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఆఫ్గన్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ఇక బౌలర్లపైనే బారం పడనుంది. 

చదవండి: Asia Cup 2022: మహ్మద్‌ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్‌లో తొలి బ్యాటర్‌గా

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top