Asia Cup 2022: కోహ్లి భవిష్యత్తు ఏమిటి? పాక్‌ మాజీ కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Asia Cup 2022 Ind Vs Pak: Shahid Afridi Statement on Virat Kohli Future - Sakshi

Asia Cup 2022- Ind Vs Pak- Virat Kohliఆసియా కప్‌-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా.. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి ఈ మెగా ఈవెంట్‌లో చెలరేగాలని ఆకాంక్షిస్తున్నారు. పాక్‌పై మంచి రికార్డు కలిగి ఉన్న కోహ్లి.. చిరకాల ప్రత్యర్థితో తిరిగి ఫామ్‌లో​కి వస్తాడని వేచి చూస్తున్నారు. 

అదే సమయంలో ఈ టోర్నీలో గనుక రాణించకపోతే తమ ఆరాధ్య క్రికెటర్‌ భవిష్యత్తు ఏమవుతుందోననే కలవరపాటుకు గురవుతున్నారు కూడా! ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది కోహ్లి భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విటర్‌ వేదికగా క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించిన ఆఫ్రిదికి కోహ్లి గురించి ప్రశ్న ఎదురైంది.

ఇందుకు స్పందనగా.. ‘‘ఆ విషయం అతడి చేతుల్లోనే ఉంది’’ అంటూ ఆఫ్రిది సమాధానమిచ్చాడు. ఇక కోహ్లి సెంచరీ చేసి వెయ్యి రోజులు పూర్తైంది కదా అని ఫాలోవర్‌ అడుగగా.. ‘‘కఠిన సమయాల్లోనే ఆటగాళ్ల గొప్పదనం బయటపడుతుంది’’ అని పేర్కొన్నాడు.

కాగా ఆగష్టు 27న ఆసియా కప్‌-2022 టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు టీమిండియా- పాకిస్తాన్‌ తలపడబోతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌ సమయంలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక కోహ్లి ఈ మెగా ఈవెంట్‌ కోసం ఇప్పటికే ప్రాక్టీసు​ మొదలుపెట్టేశాడు.

కాగా భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. మరోవైపు.. గాయపడిన కారణంగా పాక్‌ కీలక బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది కూడా ఈ ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ పేసర్‌ మహ్మద్ హస్నైన్‌ జట్టులోకి వచ్చాడు.
చదవండి: Virat Kohli:'కింగ్‌ కోహ్లి'.. మొన్న మెచ్చుకున్నారు.. ఇవాళ తిట్టుకుంటున్నారు
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top