‘అర్జున’ స్ఫూర్తితో ఒలింపిక్‌ బెర్త్‌ పట్టేస్తా: ద్యుతీ చంద్‌

Arjuna Winner Sprinter Dutee Chand Hopes To Qualify Tokyo Olympics - Sakshi

న్యూఢిల్లీ: ‘అర్జున అవార్డు’ తనకు సరైన సమయంలో లభించిందని... ఈ పురస్కారం స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను పట్టేస్తానని భారత మహిళా స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. గత శుక్రవారం కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ద్యుతీ చంద్‌ ‘అర్జున అవార్డు’కు ఎంపికైంది. ఒడిషాకు చెందిన 24 ఏళ్ల ద్యుతీ చంద్‌ ఇప్పటి వరకు మహిళల 100 మీటర్ల ఒలింపిక్‌ అర్హత మార్కును (11.15 సెకన్లు) అందుకోలేకపోవడంతో... ఆమె టోక్యో ఒలింపిక్స్‌ ఎంట్రీ అనుమానంగానే ఉంది.  
(చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌పై‌ క్లారిటీ ఇచ్చిన దాదా)

‘అర్జున అవార్డు నాకు సరైన సమయంలో లభించింది. ప్రభుత్వం నుంచి లభించే ఏ గుర్తింపు అయినా సరే అథ్లెట్‌లోని అత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంటుంది. ప్రస్తుతం నా విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వం నన్ను గుర్తించిందనే భావన నాలో కొత్త శక్తినిచ్చింది. ఒలింపిక్‌ అర్హత మార్కు కష్టంగా ఉన్నా సరే... నేను సాధించి తీరుతా’ అని ద్యుతీ పేర్కొంది. 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రజత పతకాన్ని సాధించిన ఆమె... 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా హీట్స్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది.
(చదవండి: బ్యాలెన్స్‌ నిల్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top