Andre Russell: ప్రాక్టీస్‌ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్‌

Andre Russell Unaware About Helicopter Sudden Landing Cricket Stadium - Sakshi

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్‌ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్‌ అయిన ఆండ్రీ రసెల్‌ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్‌ మాత్రం కాదులెండి..హెలికాప్టర్‌ రూపంలో రసెల్‌ను భయపెట్టింది.బీపీఎల్‌లో భాగంగా చిట్టోగ్రామ్‌లోని ఎంఏ ఆజీజ్‌ స్టేడియంలో రసెల్‌ సహా తమీమ్‌ ఇక్బాల్‌, మోర్తజా, మహ్మద్‌ షెహజాద్‌లు సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

చదవండి: Andre Rusell: రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం

ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది. దీంతో రసెల్‌ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్‌వేస్‌ అధికారులు జిల్లా కమిషనర్‌తో పాటు స్పోర్ట్స్‌ అసోసియేషన్‌తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్‌ స్టేడియం అధికారులు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.  

ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయగా..''పాపం రసెల్‌ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్‌.. బీపీఎల్‌లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: BBL 2021-22: రసెల్‌ సునామీ ఇన్నింగ్స్‌.. సిక్సర్లతో ఊచకోత..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top