వన్డే కెప్టెన్‌గా మార్క్‌రమ్‌

Aiden Markram has been named as the new ODI captain of the South Africa - Sakshi

భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన

జొహన్నెస్‌బర్గ్‌: భారత్‌తో సొంతగడ్డపై మూడు ఫార్మాట్‌లలో జరిగే సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తమ జట్లను ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌లో సఫారీ టీమ్‌కు సారథిగా వ్యవహరించిన తెంబా బవుమా, పేసర్‌ కగిసో రబాడలకు వన్డే, టి20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కలి్పంచింది. దాంతో ప్రస్తుతం టి20 టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు.

తొలి రెండు టి20లకు మాత్రమే అందుబాటులో ఉండే కొయెట్జీ, జాన్సెన్, ఎన్‌గిడిలతో పాటు బవుమా, రబాడ టెస్టు సిరీస్‌ కోసం సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సఫారీ బోర్డు వెల్లడించింది. డేవిడ్‌ బెడింగమ్, ట్రిస్టన్‌ స్టబ్స్, నాండ్ర్‌ బర్జర్‌కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం లభించగా... కీపర్‌ కైల్‌ వెరీన్, పేసర్‌ ఎన్‌గిడి టెస్టుల్లో పునరాగమనం చేశారు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్‌ కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి.  

దక్షిణాఫ్రికా జట్లు:
టి20: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్, బ్రీజ్‌కే, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, బర్జర్, జాన్సెన్, కొయెట్జీ, ఫెలుక్‌వాయో, కేశవ్‌ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్‌మన్, ఎన్‌గిడి.

వన్డే: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), జోర్జి, హెన్‌డ్రిక్స్, వాన్‌డర్‌ డసెన్, వెరీన్, క్లాసెన్, మిల్లర్, బర్జర్, ముల్డర్, ఎంపొంగ్వానా, ఫెలుక్‌వాయో, కేశవ్‌ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్‌మన్‌.
టెస్టు: బవుమా (కెప్టెన్‌), బెడింగమ్, బర్జర్, కొయెట్జీ, జోర్జి, ఎల్గర్, జాన్సెన్, కేశవ్‌ మహరాజ్, మార్క్‌రమ్, ముల్డర్, ఎన్‌గిడి, పీటర్సన్, రబాడ, స్టబ్స్, వెరీన్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top