ప్ర‌పంచ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చిన‌ 16 ఏళ్ల భార‌త కుర్రాడు | Sakshi
Sakshi News home page

Airthings Masters chess: ప్ర‌పంచ నం.1 ఆట‌గాడికి షాకిచ్చిన‌ 16 ఏళ్ల భార‌త కుర్రాడు

Published Mon, Feb 21 2022 7:54 PM

16 Year Old Praggnanandhaa Stuns World Champion Carlsen In Airthings Masters Chess Tourney - Sakshi

ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్ర‌పంచ నం.1, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు 16 ఏళ్ల భార‌త యంగ్‌ గ్రాండ్‌మాస్ట‌ర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. కేవ‌లం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించి సంచ‌ల‌నం సృష్టించాడు. గేమ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన  ప్రజ్ఞానంద.. కార్ల్‌సెన్‌కు ముచ్ఛెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. 

కాగా, తమిళనాడుకు చెందిన‌ ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గ‌జ‌ చెస్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ క్ర‌మంలో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. 
చ‌ద‌వండి: ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీలో మార్పు.. ధనాధన్ లీగ్ ఎప్ప‌టి నుంచి అంటే..?

Advertisement

తప్పక చదవండి

Advertisement