
సాధారణంగా 75 సంవత్సరాల వయసులో కొద్దిదూరం నడిచినా ఆయాసపడుతుంటారు. అస్సాంలోని దిబ్రూఘర్‌కు చెందిన 75 సంవత్సరాల హీర బోరా అలా కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో యువతను చైతన్యవంతం చేయడానికి త్రివర్ణ పతాకం చేతబూని పదికిలోమీటర్లు పాదయాత్ర చేసింది.
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘ఆమె వయసు 75 నుంచి 25కు వచ్చింది’ అంటూ నెటిజనులు స్పందించారు.