బీసీ విద్యార్థులపై చిన్నచూపా? | - | Sakshi
Sakshi News home page

బీసీ విద్యార్థులపై చిన్నచూపా?

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

● మంత్రి జిల్లాలో వివక్ష తగునా.. ● ఉడకని పప్పు, చిన్నసైజు గుడ్డు ● ఇప్పటికీ హాస్టళ్లకు రాని సరుకులు ● సమీక్షలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

● మంత్రి జిల్లాలో వివక్ష తగునా.. ● ఉడకని పప్పు, చిన్నసైజు గుడ్డు ● ఇప్పటికీ హాస్టళ్లకు రాని సరుకులు ● సమీక్షలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

సిద్దిపేటజోన్‌: బీసీ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, ప్రభుత్వం నిర్లక్ష్యంతో సంక్షోభ హాస్టళ్లుగా మారిపోయాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బీసీ హాస్టళ్లలో సరుకుల సరఫరా, డైట్‌ బిల్లులు, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై అధికారులు, వార్డెన్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. బీసీ హాస్టళ్లకు నిధుల కేటాయింపు అంశంలో ప్రభుత్వం తీవ్ర వివక్షను చూపుతోందని ఆరోపించారు. అన్ని జిల్లాల్లో స్కూల్‌, ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లకు నిర్వహణకు రూ.40 వేల చొప్పున మంజూరు చేస్తుండగా, సిద్దిపేట జిల్లాకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు రూ. 60 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తుండగా, సిద్దిపేట జిల్లాకు రూ.20వేలు మాత్రమే ఇవ్వడం శోచనీయమన్నారు. హాస్టళ్లకు అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 2026 ఫిబ్రవరి నుంచి అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సిద్దిపేట బాలికల కళాశాల హాస్టల్‌ అద్దె రూ.10 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యూటర్లకు 10 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హాస్టళ్ల విద్యార్థుల కోసం రూ.15 కోట్లు విడుదల అయితే కాంగ్రెస్‌ గత ఏడాది రూ.9.55 కోట్లు కోత పెట్టిందని, ఈ ఏడాది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే మెస్‌ చార్జీలు సరిపోవడం లేదని, వెంటనే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో హాస్టళ్ల పిల్లలకు తాండూరు కందిపప్పు పంపిణీ జరిగేదని, నేడు క్వాలిటీ లేని బి గ్రేడ్‌ పప్పు సరఫరా చేస్తుండటంతో ఉడకడం లేదన్నారు. కోడిగుడ్డు సైజు సైతం చిన్నగా ఉందదన్నారు. నవంబర్‌ వచ్చినా ఇప్పటికీ హాస్టళ్లకు సరుకులు రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement