జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ప్రారంభం

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

● పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి కె.శరత్‌

● సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్‌లో మెడికల్‌ డిస్పెన్సరీ

సిద్దిపేటకమాన్‌: జిల్లా కేంద్రం సిద్దిపేటలో జువైనల్‌ జస్టిస్‌ బోర్డును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె.శరత్‌ శనివారం ప్రారంభించారు. వేదపండితులు అతడికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మెడికల్‌ డిస్పెన్సరినీ హైకోర్టు న్యాయమూర్తి ప్రారంభించారు. అంతకుముందు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాధులతో హైకోర్టు న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌, న్యాయమూర్తులు జయప్రసాద్‌, సంతోష్‌కుమార్‌, తరణి, సౌజన్య, జిల్లా కలెక్టర్‌ హైమావతి, పోలీసు కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌, ఏసీపీలు రవిందర్‌రెడ్డి, సుమన్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌, సీఐలు మహేందర్‌రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, ముత్యంరాజు, ఎస్‌ఐలు రాజేష్‌, ఉమేష్‌, గోపాల్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌బాబు, సీనియర్‌ న్యాయవాదులు జనార్థన్‌రెడ్డి, దేవునూరి రవీందర్‌రెడ్డి, పత్రి ప్రకాష్‌, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement