ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ విధ్వంసకర రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ విధ్వంసకర రాజకీయాలు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

● ఇందిరా గాంధీ జయంతికి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తాం ● కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు రఘువర్ధన్‌రెడ్డి

● ఇందిరా గాంధీ జయంతికి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తాం ● కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు రఘువర్ధన్‌రెడ్డి

దుబ్బాకటౌన్‌: కాంగ్రెస్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నాయకుల విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు గాడిపల్లి రఘువర్ధన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలిలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రఘువర్ధన్‌ రెడ్డి ఇటీవల జంక్షన్‌లో పిల్లర్‌ నిర్మాణం చేపట్టారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని పెడుతున్నారంటూ బుధవారం అర్ధరాత్రి కొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు గద్దెకు ఉన్న పిల్లర్‌ బాక్సులను తొలగించి, ధ్వంసం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య గొడవ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాల నాయకులను అక్కడినుంచి పంపించేశారు. రాత్రంతా కూడలి వద్ద పోలీసు సిబ్బంది పహారా కాశారు. రఘువర్ధన్‌ రెడ్డి తన అనుచరులతో శుక్రవారం పట్టణంలోని జంక్షన్‌ వద్దకు చేరుకుని, ధ్వంసమైన పిల్లర్‌ గద్దెను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ కూడలిని నిర్మించక ముందు అక్కడ ఇందిరాగాంధీ విగ్రహాం ఉండేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. అందుకే కూడలి వద్ద నూతనంగా ఇందిరాగాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టామన్నారు. కొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలనే గద్దె పిల్లర్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నాయకులు ఇలాంటి విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇందిరా గాంధీ జయంతికి అందరి అనుమతితో అక్కడే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని తెలిపారు. విగ్రహా గద్దె కూల్చివేతకు పాల్పడిన ఏడుగురు బీఆర్‌ఎస్‌ నాయకులపై దుబ్బాక సీఐ రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో విగ్రహ పునఃప్రతిష్టకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. మేనేజర్‌ శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement