టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. స్కావెంజర్లకు వేతనాలు చెల్లించాలంటూ గురువారం జిల్లా విద్యా శాఖ ఏడీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ ను డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. జిల్లాలో వర్క్ అడ్జస్ట్ మెంట్ అలాట్మెంట్ విషయంలో దివ్యాంగ, ఒంటరి మహిళా ఉపాధ్యాయులను మినహాయించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలన్నారు. జనాభా గణన–2026 విధులలో రిజర్వులో ఉన్న ఉపాధ్యాయులు అటెండెన్స్ సర్టిఫికెట్‌లు పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చిట్యాల విజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


