మా బావిలో 8 మీటర్ల లోతులో ఉండే నీళ్లు 18 మీటర్లకు పడిపోయాయి. వానా కాలంలో వేసిన వరి ఇంకా కోయలేదు. యాసంగికి నీళ్లు కష్టమే. మరోవైపు కరెంట్ కోతలతో తిప్పలు పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మెట్ట ప్రాంతాన్ని కరువు మండలంగా గుర్తించి రైతులను ఆదుకోవాలి. సహాయం అందించాలి.
– రాంగోపాల్‌రావు, రైతు గాంధీనగర్
కరువుతో మెట్ట రైతులకు కష్టాలు
వానలు లేక పూర్తిస్థాయిలో పంటలు వెయ్యలేదు. వేసిన అరకొర పంటలు కూడా నీరు అందక ఎండిపోయాయి. ఊర్లలో తాగునీటికి సైతం తిప్పలు పడుతున్నాం. నీరు లేక సాగు భూములను బీడుగానే వదిలేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో హుస్నాబాద్‌లో కరువు లేదంటే ఏట్లా?.
– పచ్చిమట్ల రవీందర్, రైతు హుస్నాబాద్


