భూ రీ సర్వేకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

భూ రీ సర్వేకు సహకరించండి

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

కొమురవెల్లి(సిద్దిపేట): భూ భారతి రీ సర్వేకు సహకరించాలని కలెక్టర్‌ హైమావతి రైతులను కోరారు. మండలంలోని తపాస్‌పల్లిలో నిర్వహిస్తున్న భూ భారతి రీ సర్వేను క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం చేసిన భూముల సర్వే తిరిగి మళ్లీ ఇప్పుడు చేస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరగడంతో భూ కమతాలు చిన్నగా మారి సమస్యలు పెరిగాయాని, దీనికి శాశ్వత పరిష్కారం అందించడం కోసమే ప్రభుత్వం భూ రీ సర్వేను చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామ విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు ఎంత సర్వే నిర్వహించారు? అనే విషయాలపై సర్వే చేస్తున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రోజూ 40 ఎకరాలకు పైగా సర్వే చేయాలని, సర్వే ప్రకియ పారదర్శకంగా, కచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వే చేసిన ప్రతి అంశం రికార్డులలో నమోదు చేసి రైతులకు తెలపాలని సూచించారు. కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్‌ దివ్య, సర్పంచ్‌ పుట్ట కనుకరాజు, రైతులు సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతులతో కలెక్టర్‌ హైమావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement