‘దివ్య’విద్యకు ఎస్‌ఐ భరోసా | - | Sakshi
Sakshi News home page

‘దివ్య’విద్యకు ఎస్‌ఐ భరోసా

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

● ప్రత్యేక అనుమతితో గురుకులంలో ప్రవేశం

● మానవత్వాన్ని చాటిన గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం

వర్గల్‌(గజ్వేల్‌): అసలే పేదకుటుంబం. తండ్రి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. దీంతో తనతోపాటు పన్నెండేళ్ల లోపున్న తోడబుట్టిన ఇద్దరి పోషణ దినసరి కూలీపని చేసే తల్లికి కష్టమైంది. పెద్దకూతురు దివ్య విద్యాభ్యాసం తలకుమించిన భారంగా పరిణమించింది. విషయం తెలిసిన ఎస్‌ఐ ఆరోగ్యం మానవత్వంతో స్పందించి బాలిక విద్యాభ్యాసానికి బాసటగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వర్గల్‌ మండలం వేలూరుకు చెందిన ఘనపురం రాజు–కవిత దంపతులకు దివ్య, దీప్తి, భార్గవ్‌ ముగ్గురు పిల్లలు. మేసీ్త్ర పనిచేసే రాజు ఐదేళ్లక్రితం స్లాబ్‌పై నుంచి పడి మృతిచెందాడు. దీంతో కవిత కూలీపని చేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. పెద్దకూతురు దివ్య ఆరోతరగతితోనే చదువు ఆపే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం చదువు ప్రాధాన్యతను తల్లికి వివరించారు. జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల సొసైటీ రాష్ట్ర కార్యదర్శికి లేఖ ద్వారా బాలిక పరిస్థితిని తెలియజేసి గౌరారం సమీప పూలే గురుకులంలో సీటు కోసం కోరారు. వారు అంగీకరించడంతో బాలికకు అవసరమైన దుస్తులు, వస్తు తదితరసామగ్రిని ఎస్‌ఐనే ఇప్పించి బాలికను గురుకులంలో చేర్పించారు. దివ్య చదువుకు భరోసాగా నిలిచి సమాజ సేవలోనూ ముందుండాలనే సందేశాన్ని చాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement