● వచ్చేనెల 1న రామ్‌లీలా మైదానంలో నిరసన
● ఏఐసీసీ అధికార ప్రతినిధి సరళ్‌పటేల్
గజ్వేల్: ఓటు హక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటికై నా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఉమ్మడి మెదక్ జిల్లా పరిశీలకుడు సరళ్ పటేల్ స్పష్టం చేశారు. ఆదివారం గజ్వేల్‌లోని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ‘ఎస్‌ఐఆర్’ పేరిట ప్రజల ఓట్లను చోరీ చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే ఈ అంశంపై తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోరాడుతున్నారని ఇదే క్రమంలో నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లక్షలాదిమందితో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రీతమ్ మాట్లాడుతూ ‘సర్’ వల్ల ఓట్ల చోరీ జరుగుతున్న అంశంపై బీఆర్‌ఎస్ నోరుమెదపకపోవడం సిగ్గచేటన్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌తో కలిసిరావాలని పిలుపునిచ్చారు.


