ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చెకుముకి పోటీలతో విద్యార్థుల నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు మహేంద్రం పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన చెకుముకి జిల్లా కార్యవర్గ సమావేశంలో మహేంద్రం పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఏటా నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు విద్యార్థులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఇలాంటి పోటీలతో విద్యార్థులలో పరిశీలనా నైపుణ్యాలను, తార్కికతను, శాసీ్త్రయ దృక్పథాలు పెంపొందుతాయన్నారు. చెకుముకి పోటీలు పాఠశాలస్థాయి నవంబర్ 7న, మండలస్థాయి నవంబర్ 21న, జిల్లా స్థాయి నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అజీజ్, గౌరవ అధ్యక్షుడు మెలుగు బాలరాజు, ప్రధాన కార్యదర్శి తుమ్మ సత్యం, ఉపాధ్యక్షుడు రామచంద్రంగారు, జిల్లా కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక
రాష్ట్ర కమిటీ సభ్యుడు మహేంద్రం


