జయమునిచ్చే జగన్మాత | - | Sakshi
Sakshi News home page

జయమునిచ్చే జగన్మాత

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

కేసీఆర్‌ను కలిసిన వంటేరు ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

● రాజరాజేశ్వరిదేవిగా వర్గల్‌ అమ్మవారు

● ముగిసిన దసరా శరన్నవరాత్రోత్సవాలు

వర్గల్‌(గజ్వేల్‌): విద్యాధరిమాత కొలువైన వర్గల్‌ క్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు మంగళవారం విజయదశమి వేడుకలతో ముగిశాయి. పర్వదిన వేళ అమ్మవారు జయములిచ్చే జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. ఉదయం విశేషాభిషేకం, అమ్మవారి అలంకారం, అర్చనలు జరిగాయి. శమీపూజ అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి అమ్మవారి దర్శనం లభించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా వేంకటేశ్వరునికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవ వేడుకలలో పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

గజ్వేల్‌: దసరా సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ను మంగళవారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జమ్మి పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత శాలువాతో కేసీఆర్‌ను సన్మానించారు.

ఆశ్రమ పీఠాధిపతి విశ్వాత్మానందగిరి స్వామి

మిరుదొడ్డి(దుబ్బాక): సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాచలం గీత ఆశ్రమ పీఠాధిపతి విశ్వాత్మానంద గిరి స్వామిజీ పిలుపునిచ్చారు. దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలో సుహాసినీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ స్వయంగా దళిత మహిళల పాదాలను కడిగి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అయన అనుగ్రహభాషణం చేశారు. ఆస్తులు అంతస్తుల కంటే ధర్మానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధర్మాన్ని కాపాడాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి, సామాజిక సమరసత అభియాన్‌ రాష్ట్ర కన్వీనర్‌ ధనుంజయ, నైపుణ్య ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మొగుళ్ళ ఐలయ్య, నాయకులు పాల్గొన్నారు.

ముగిసిన త్రిరాత్రోత్సవాలు

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో దేవి త్రిరాత్రోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి శోభాయాత్రగా వైభవంగా జరిగింది. అనంతరం స్వామి పుష్కరిణి(ధర్మగుండం)లో త్రిశూల స్నానం చేయించి పరిసమాప్తి గావించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌, రవి, భాస్కర్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement