నాకున్న రెండు ఎకరాలతో పాటు, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసుకున్న. మొదట్లో బాగానే ఉంది. ఆగస్టు తర్వాత వర్షాల జాడ లేకపోవడంతో కాత రాలిపోయింది. ఎకరానికి నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. –జైరాంలు,
పత్తిరైతు. కన్సాన్పల్లి, సంగారెడ్డి
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు
గతంలో ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల పత్తి వచ్చేది. ఈసారి సమయానికి వర్షాలు కురియకపోవడంతో దిగుబడి తగ్గింది. ఎకరానికి మూడు క్వింటాళ్లు కూడా రావడం లేదు. ఒక్కో ఎకరానికి రూ.30 వేల వరకు పంట పెట్టుబడి అయింది. పంట అమ్మితే వచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు. – పోచారం మల్లేశం,
దాదాయపల్లి, మెదక్


